కోల్డ్‌స్టోరేజీలు నిర్మిస్తాం: మంత్రి ఉత్తమ్
ABN, Publish Date - May 22 , 2025 | 12:27 AM
రాష్ట్రంలో రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని, రైతుల అవసరాలకు అనుగుణంగా కోల్డ్‌స్టోరేజ్‌లు నిర్మిస్తామని మంత్రి ఎన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
హుజూర్‌నగర్, మే 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని, రైతుల అవసరాలకు అనుగుణంగా కోల్డ్‌స్టోరేజ్‌లు నిర్మిస్తామని మంత్రి ఎన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో నూతన కమిటీతో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలుతో పాటు పేదలకు సన్నబియ్యం అందిస్తోందన్నారు. ఏడీఏ కార్యాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని సీజన్లలో రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామన్నారు. మెరుగైన పాలన కోసం రాష్ట్రంలోని ఇతర వ్యవసాయ మార్కెట్ యార్డులను పరిశీలించి, ఆదర్శమార్కెట్ యార్డుగా తీర్చిదిద్దాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ తేజ్‌సనందలాల్ పవార్, మార్కెట్ కమిటీ చైర్మన రాధికఅరుణ్‌కుమార్, వైస్‌చైర్మన ఆదూరి స్రవంతికిషోర్‌రెడ్డి, మార్కెట్ కార్యదర్శి శ్రీధర్, దొంగరి వెంకటేశ్వర్లు, గూడెపు శ్రీనివాసు, యరగాని నాగన్న, దొంగరి సత్యనారాయణ, మంజూనాయక్, వీరారెడ్డి, కమిటీ డైరెక్టర్లు, అల్లం ప్రభాకర్‌రెడ్డి, ఈడ్పుగంటి సుబ్బారావు, మంజూనాయక్, నాగేశ్వరశర్మ, నవీన్‌కుమార్‌చౌదరి, శ్రీధర్, శివారెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, అజీజ్‌పాషా, శ్రీనివా్‌సగౌడ్, తన్నీరు మల్లికార్జున్‌రావు, రవినాయక్, సైదులునాయక్ పాల్గొన్నారు.
దేశం గర్వించదగిన నేత రాజీవ్
దేశం గర్వించదగిన గొప్ప నాయకుడు రాజీవ్‌గాంధీ అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాజీవ్ వర్థంతి సందర్భంగా హుజూర్‌నగర్‌లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
యాసంగికి ఎత్తిపోతలను సిద్ధం చేయాలి
మేళ్లచెర్వు : వచ్చే యాసంగి నాటికి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి, వినియోగంలోకి తేవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నూతన ఎత్తిపోతల పథకాలపై చింతలపాలెం మండలకేంద్రంలోని అంజనీ సిమెంట్ ఫ్యాక్టరీ ఆవరణలో ఏర్పాటుచేసిన సమీక్షకు ఆయన హాజరయ్యారు. కొత్త ఎత్తిపోతల పథకాలతో హుజూర్‌నగర్ నియోజకవర్గంలో 71,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఇప్పటికే కొంత భూసమీకరణ పూర్తయ్యిందని, జులై చివరి నాటికి పూర్తిస్థాయిలో భూసేకరణ చేయాలన్నారు. న్యాయబద్ధంగా భూపరిహారం అందజేస్తామని, రైతులు సహకరించాలన్నారు. రూ.394 కోట్లతో చేపడుతున్న దొండపాడు-2 ఎత్తిపోతల పథకానికి రాజీవ్‌గాంధీ ఇరిగేషన స్కీమ్‌గా నామకరణం చేశారు. అదేవిధంగా వెల్లటూరులో రూ.1450కోట్లతో చేపట్టే ముక్త్యాల బ్రాంచి కెనాల్‌కు ఇందిరా గాంధీ ఎత్తిపోతల పథకంగా నామకరణం చేశామన్నారు. సమావేశంలో కలెక్టర్ తేజ్‌సనందలాల్ పవర్, ఆర్డీవో శ్రీనివాసులు, ఇరిగేషన సీఈ రమే్‌షబాబు, ఎస్‌ఈ శివధర్మతేజ, ఈడీలు చారి, హరికిషోర్, తహసీల్దార్ సురేందర్‌రెడ్డి, ఎంపీడీవో భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
రూ.2 కోట్లతో మట్టపల్లి ఆలయ అభివృద్ధి
మఠంపల్లి : మఠంపల్లి మండలాన్ని ఊహించనంతగా అభివృద్ధి చేశానని, మట్టపల్లి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మండలంలోని బక్కమంతులగూడెం సమీపంలో రూ.3.5 కోట్లతో నిర్మించిన సబ్‌స్టేషనను కలెక్టర్ తేజ్‌సనందలాల్ పవార్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బిందువుగా మఠంపల్లి మండలం మారబోతుందన్నారు. ప్రజలకు మైరుగైన విద్యుత సేవలు అందించడం సంతోషకరంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, ఎస్‌ఈ ప్రాంక్లిన, డీఈ వెంకటకృష్ణయ్య, సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంజూనాయక్, ఆదూరి కిషోర్‌రెడ్డి, ఎల్లారెడ్డి, భాస్కర్‌రెడ్డి, వీరారెడ్డి, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - May 22 , 2025 | 12:27 AM