ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నెలరోజులుగా పడిగాపులు కాస్తున్నాం

ABN, First Publish Date - 2025-05-29T00:44:45+05:30

నెల రోజుల నుంచి ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో పడిగాపులు కాస్తున్నాం, లారీల కొరత సాకుతో తీసుకెళ్లన ధాన్యం మొలకెత్తిన ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు

అర్వపల్లి, మే 28 (ఆంధ్రజ్యోతి): నెల రోజుల నుంచి ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో పడిగాపులు కాస్తున్నాం, లారీల కొరత సాకుతో తీసుకెళ్లన ధాన్యం మొలకెత్తిన ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి గ్రామంలోని మల్లంపల్లి-నకిరేకల్‌(365 నెంబరు) జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యాన్ని నేటికీ కొనుగోలు చేయకపోవడంతో తడిసి ముద్దవుతోందన్నారు. మొలకెత్తి దెబ్బతింటోందన్నారు. ఎన్నడూలేనివిధంగా లారీల కొరత పేరుతో ధాన్యం కాంటా వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న సీఐ రఘువీరారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేయించారు. రాస్తారోకోతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో రైతులు గోసుల విజయ్‌, లక్ష్మీనర్సింహ, అంకిరెడ్డి రాజారాం, నాగార్జున, మల్లేష్‌, అయోధ్య, లక్ష్మమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2025-05-29T00:44:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising