ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం
ABN, Publish Date - May 07 , 2025 | 12:22 AM
రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని కలెక్ట ర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం మండలంలో ని గుర్రంపోడు, కొప్పోలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె తఖీ చేశారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి
గుర్రంపోడు, మే 6 (ఆంద్రజ్యోతి): రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని కలెక్ట ర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం మండలంలో ని గుర్రంపోడు, కొప్పోలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె తఖీ చేశారు. రికార్డులను పరిశీలించి మాట్లాడుతూ, యాసంగి సీజన్‌లో జిల్లాలో ఇప్పటివర కు 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచామన్నారు. వర్షం వచ్చినప్పటికీ రైతులు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవస రం లేదని, వారం రోజుల్లో జిల్లాలో ధాన్యం కొనుగోలు ను పూర్తిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మండలంలో లారీల కొరత ఉందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, లారీల సమస్య తలెత్తకుండా ఒకే మిల్లుకు నాలుగైదు పంపించకుండా ఆ పరిధిలో ఉన్న మిల్లులన్నింటికీ లారీలను పంపించాలని నిర్వాహకులకు సూ చించారు. కేటాయించిన లారీలు సరిపోకపోతే అదనం గా స్థానికంగా లారీలను ఏర్పాటు చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి దళారు లు ధాన్యాన్ని తీసుకువస్తే వారిపై కేసులు నమోదు చే స్తామని హెచ్చరించారు. మిల్లరు ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.కలెక్టర్ వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, పౌరసరఫరాలశాఖ డీఎం హరీష్, డీసీవో ఉన్నారు.
ఫాంపాండ్లు నిర్మించుకోవాలని
(ఆంధ్రజ్యోతి, నిడమనూరు): రైతులు ఫాంపాండ్లు నిర్మించుకోవాలని, తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం మండలంలోని ఎర్రబెల్లి శివారులోని లోలెవెల్ కెనాల్(ఎల్‌ఎల్‌సీ)ను ఆమె పరిశీలించారు. గ్రామ శివారులో ఉన్న శనగకుంట చెరువును నింపడంతో పాటు ఎల్‌ఎల్‌సీ కెనాల్‌తో శాశ్వత లిఫ్టును ఏర్పాటు చేయాలని, ముత్యాలమ్మ కుంట ఆక్రమణలు అడ్డుకోవాలని గ్రామస్థులు ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో వారి ప్రతిపాదనల మేరకు కలెక్టర్ ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, రెవెన్యూ, ఐబీ అధికారుల తో కలిసి చెరువును, కెనాల్‌ను పరిశీలించారు.
గతంలో యూటీ ద్వారా మోటార్ల సాయంతో శనగకుంట చెరువుకు నీటిని సరఫరా చేశారని, మోటార్లు మరమ్మతులకు గురవడంతో వర్షం నీరే దిక్కైందని రైతులు కలెక్టర్‌కు వివరించారు. చెరువు పరిధిలో ఆయకట్టు, శాశ్వత లిఫ్టు ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఐబీ డీఈ శివరాత్రి శ్రీనివా్‌సను అడిగి తెలుసుకున్నా రు. 41 ఎకరాల ఆయకట్టు మాత్రమే ఉందని, లిఫ్టు సా ధ్యం కాదని ఆయన వివరించారు. దీంతో ఫాంపాండ్లు నిర్మించుకోవాలని రైతులకు ఆమె సూచించారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో బోనగిరి రమే్‌షను ఆదేశించారు. అనంతరం చెరువు శిఖం భూముల ఆక్రమణలపై స్పందించి సర్వే చేసి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ జంగాల కృష్ణయ్యను ఆదేశించారు. ఆమె వెంట ఐబీ ఏఈ ప్రవీణ్‌రాజ్, ఆర్‌ఐ సందీప్, సర్వేయర్ విజయ్‌కుమార్, తదితరులు ఉన్నారు.
Updated Date - May 07 , 2025 | 12:22 AM