ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్థానిక ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలి

ABN, Publish Date - Jun 30 , 2025 | 12:42 AM

హామీలు అమలు చేయని పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో బుద్ధిచెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారు రవికుమార్‌ అన్నారు. వెల్లంకి గ్రామంలో జరిగిన సీపీఎం విస్తృతస్థాయి సమావేశాలకు ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రవికుమార్‌

రామన్నపేట, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): హామీలు అమలు చేయని పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో బుద్ధిచెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారు రవికుమార్‌ అన్నారు. వెల్లంకి గ్రామంలో జరిగిన సీపీఎం విస్తృతస్థాయి సమావేశాలకు ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. ప్రజల గోడు పట్టని పెట్టుబడిదారులు గ్రామాలకు వచ్చి ఎన్నికల ముందు డబ్బులతో ప్రజలను మోసగించాలని చూస్తున్నారని, వారికి ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్పాలన్నారు. కమ్యూనిస్టులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, డబ్బు ప్రలోభాలకు లొంగకుండా నిబద్దత కలిగిన కమ్యూనిస్టులను స్థానిక ఎన్నికల్లో గెలిపించాలన్నారు. ప్రజలకు ఏ కష్టమొచ్చినా నిరంతరం పోరాటం చేసేది కమ్యూనిస్టులే అని అన్నారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి : జహంగీర్‌

రామన్నపేట మండలంలోని గ్రామాల్లో అర్హులందరికీ రాజకీయ జోక్యం లేకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని, లబ్ధిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ డిమాండ్‌చేశారు. కనీసం ఇళ్లులేని పేదలను ఎంపిక చేయకుండా గత ప్రభుత్వం మాదిరిగానే వ్యవహరిస్తుందన్నారు. కార్యక్రమంలో జల్లెల పెంటయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, వనం ఉపేందర్‌, నర్సింహచారి, ఆవనగంటి నగేష్‌, ఎర్రోళ్ళ లక్ష్మమ్మ, పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2025 | 12:42 AM