అప్రమత్తతే రక్ష
ABN, Publish Date - Jul 07 , 2025 | 12:33 AM
వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. పొలాలను ట్రాక్టర్లతో దమ్ము చేసి వరినాట్లు వేస్తారు. చాలా మంది డ్రైవర్లు అనుభవం లేకపోవడం, కనీస జాగ్రత్తలు పా టించకపోవడంతో ట్రాక్టర్లతో పొలాలను దున్నే స మయంలో ప్రమాదాలకు గురవుతున్నారు.
వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. పొలాలను ట్రాక్టర్లతో దమ్ము చేసి వరినాట్లు వేస్తారు. చాలా మంది డ్రైవర్లు అనుభవం లేకపోవడం, కనీస జాగ్రత్తలు పా టించకపోవడంతో ట్రాక్టర్లతో పొలాలను దున్నే స మయంలో ప్రమాదాలకు గురవుతున్నారు. నైపు ణ్యం కలిగిన డ్రైవర్ల కొరత వారి జీతభత్యాలను భరిం చలేక అనుభవం కలిగిన వారిని డ్రైవర్లను రైతులు ని యమించుకోలకపోతున్నారు. అవగాహన రాహి త్యంతో ట్రాక్టర్ నడుపుతూ మృత్యువాత పడుతున్నారు.
- (ఆంధ్రజ్యోతి- భువనగిరి రూరల్)
కారణాలివే..
8 నీటితో నిండిన పొలాన్ని దున్నే సమయంలో గుంతలు తెలియవు. దాన్ని సరిగా అంచనా వేయకపోతే ప్రమాదాలు తప్పవు.
8 పొలాల్లో నీరు ఉండడంతో అంతా ఒకేలా ఉం టుంది. భూమి ఎక్కడ దిగబడుతుందో , ఎక్కడ తేలిగ్గా ఉంటుందో తెలుసుకోవాలి.
దమ్ము చేసే సమయంలో ట్రాక్టర్ ఎక్స్‌క్‌వేటర్‌ను వాడుతారు. 8 బ్రేక్‌లను విడివిడిగా దిశ మార్చుకునేందుకు ఉపయోగిస్తారు.
వాహనాన్ని క్లచతోనే నియంత్రించవచ్చు. అనుభవం లేకపోతే బ్రేకులు వేసిన వాహనం ఆగడం లేదని భావించి ఆందోళనకు గురవుతారు.
కొన్ని సందర్భాల్లో దమ్ము చక్రాలు పూర్తిగా మట్టితో నిండిపోతాయి. ఆ సమయంలో డ్రైవర్లు ఎక్కువ శక్తిని వినియోగిస్తారు. ఈ సందర్భంలో ట్రాక్టర్ బోల్తాపడే అవకాశం ఉంటుంది.
ట్రాక్టర్ పొలంలోని విద్యుత స్తంభాలు తాకినప్పుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
బ్రేకులు సరిగ్గా పడకపోతే గట్టు ఎక్కినప్పుడు వాహనం బోల్తా పడుతుంది.
గట్టు ఎక్కే క్రమంలో అనుభవంతో నడపాల్సి ఉం టుంది. ఒకేసారి ఎక్స్‌క్‌వేటర్ ఇస్తే వాహనం తిరగబడుతుంది. 8 పొలం పక్కనే పాడుపడిన బావులు ఉంటే ట్రాక్టర్లు అందులో కూరుకుపోయిన సందర్భాలు ఉన్నాయి.
ఇలా చేయాలి ..
దమ్ము చక్రాలను బిగించేటప్పుడు తప్పనిసరిగా చక్రాలకు సమాన స్థాయిలో బరువులను ట్రాక్టర్ ముందు భాగంలో బిగించాలి. వాహనాన్ని దమ్ములోకి దింపే ముందు పూర్తిస్థాయిలో సిద్ధం చేసుకోవాలి. బరువు ఎక్కువైతే ఇంధనం ఖర్చు పెరుగుతుందనే ఉద్దేశంతో చాలా మంది బరువులను వాడటం లేదు. ట్రాక్టర్‌ను ఎప్పుడు ఒకే వేగంతో నడపాలి. మూలమలుపులు, విద్యుత స్తంభాల వద్ద నెమ్మదిగా వెళ్లాలి. గతంలో భువనగిరి మండలంలోని వీరవెల్లి, ముస్త్యాలపల్లి, చీమలకొండూరు గ్రామాల్లో ట్రాక్టర్‌తో దమ్ము చేస్తు పలువురు రైతులు గాయాలపాలయ్యారు.
Updated Date - Jul 07 , 2025 | 12:33 AM