ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వరుణా..కరుణ చూపవా..!

ABN, Publish Date - Jun 24 , 2025 | 11:56 PM

వరుణ దేవుడా కరుణించు అంటూ రాజాపేట మండల ప్రజలు వేడుకుంటున్నారు.

రాజాపేట మండలంలో దుక్కి దున్నిపెట్టిన రైతులు

నీటి తడికోసం నోళ్లు తెరుచుకున్న దుక్కులు

రాజాపేట, జూన 24(ఆంధ్రజ్యోతి): వరుణ దేవుడా కరుణించు అంటూ రాజాపేట మండల ప్రజలు వేడుకుంటున్నారు. రోహిణి కార్తెకి ముం దు వెనుక రెండు రోజులు తొలకరి వర్షాలు పలకరించి అన్నదాతను మురిపించాయి. ముం దుగా మురిపించిన మేఘాలు ఇప్పుడు ముఖం చాటేశాయి. మృగశిర పోయి ఆరుద్ర కార్తె వచ్చినా వర్షపు నీటి బొట్టు కురువక పోవటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. తొలకరిలో కురిసిన వర్షానికి కొంత మంది రైతులు పత్తి, నువ్వులు, మొక్కజొన్న, పచ్చజొన్న సాగు చేశారు. ఆశించిన మేరకు వర్షం కురువక పోవడంతో నాటిన విత్తనం కొంత మేరకే మొలకెత్తింది. దుక్కుల సాగు అంతంత మాత్రం గానే సాగింది. వర్షం లేక పోవటంతో రైతులు తడి లేని ఎండిన భూమిలోనే విత్తనాలను నాటుకున్నారు. వర్షం కురిసినప్పుడు విత్తనం మొలకెత్తక పోతదా.. అని అధికమొత్తంలో ఖర్చు చేసి విత్తనాలను ఆశతో విత్తుకున్నారు. పొడి నేలలో విత్తుకున్న విత్తనాలు నెల రోజుల నుంచి చినుకు కురువక పోవటంతో విత్త నం మొలకెత్త లేదు. అక్కడక్కడ మొలకెత్తిన చిన్న చిన్న మొక్కలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.

పంటల సాగు ఇలా..

మండలంలో సాధారణంగా 18550 ఎకరాల్లో వరి, పత్తి4760 ఎకరాల్లో సాగు కావాల్సి ఉంది. అయినప్పటికీ వరి, పత్తి సాగు మూడంకెలు దాటలేదు. మండలంలో చెరువులు, కుంటల్లో చుక్క నీరు లేక పోవడంతో రైతులు పూర్తిగా బోర్లు, బావుల పైనే ఆధార పడి సేద్యం చేస్తున్నారు. యాసంగిలో భూగర్భ జలాలు అడుగంటడంతో ఎక్కువ ఎకరాల్లో పంట ఎండి పోయింది. రైతులు తీవ్రంగా నష్ట పోయారు. ఈ ఖరీఫ్‌ లోనైనా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఆశ పడితే చినుకు జాడలేదు. రోహిణికి ముందు నార్లు పోసుకుని నాట్లు వేస్తే పంట దిగుబడి అధికంగా వస్తుందని కొంతమంది రైతులు ముందుగానే వరి నార్లు పోసుకున్నారు. బోర్లు, బావుల్లో నీరు రాక పోవటంతో సాగు కష్టంగానే మారింది. పెరుగుతున్న నారును ఏమి చెయ్యాలో రైతులకు తోచడం లేదు. వర్షాలు లేక రోజు రోజుకు ఖరీఫ్‌ సాగుపై ఆశలు సన్నగిల్లు తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

మండలంలో వర్షపాతం ఇలా..

నెల సాధారణ కురిసిన ఎన్నిరోజుల్లో

ఏప్రిల్‌ 16.9 33.4 మూడు

మే 20.5 87.4 ఆరు

జూన 89.2 53.4 నాలుగు

సరిగా మొలకెత్త లేదు

తొలకరిలో కురిసిన ప ర్షానికి మూడు ఎకరాల్లో పత్తి విత్తనాలను నాటుకున్నాను. దున్నడానికి, విత్తనాల కు సుమారు 20 వేల రూపాయలు ఖర్చయ్యింది. తడి సరిగా లేక పోవడంతో తిరిగి వర్షంపడక పోవడంతో పూర్తి స్థాయిలో మొ లకెత్త లేదు. మొలిచిన మొక్కలను కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతున్నాం.

-నిమ్మల నవీన, రైతు బొందుగుల

రైతులు ఆందోళన చెందవద్దు

మండలంలో రైతులు వర్షాల కోసం ఆందోళన చెందవద్దు. ఆరుతడి పంటల సాగుకు వచ్చే నెల మొదటి వారం వరకు సమయం ఉంది. రైతులు వరిపైరు పెంపకంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

-గొల్లపల్లి పద్మజ, మండల వ్యవసాయాధికారి, రాజాపేట

Updated Date - Jun 24 , 2025 | 11:56 PM