ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అనుకోని అతిథి..ఇదిగో బహుమతి

ABN, Publish Date - May 01 , 2025 | 01:37 AM

బీఆర్‌ఎస్‌ రాజ్య సభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర వ్యక్తిగత పనులపై బుధవారం భువనగిరికి వచ్చాడు.

భువనగిరి టౌన, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి) ః బీఆర్‌ఎస్‌ రాజ్య సభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర వ్యక్తిగత పనులపై బుధవారం భువనగిరికి వచ్చాడు. ఈ మేరకు ఆయన కారులో స్థానిక విద్యానగర్‌ గుండా వెళ్తుండగా రోడ్డు పక్కన ఆడుకుంటున్న పిల్లలు కనిపించారు. దీంతో వెంటనే కారు ఆపి దిగి పిల్లల వద్దకు వెళ్లి తనకు తనను పరిచయం చేసుకొని మాట్లాడుతూ ఏమి ఆడుతున్నారు, మీ పేర్లు ఏమిటి, ఏమి చదువుకుంటున్నారు తదితర కుశల ప్రశ్నలు వేసి వారందరిని కారులో కూర్చోబెట్టుకొని సొంతంగా డ్రైవింగ్‌ చేసుకుంటూ దుకాణానికి తీసుకవెళ్లి నచ్చిన క్రీడా వస్తువులను కొనిపించి తిరిగి అదే స్థలంలో వదిలిపెట్టాడు. దీంతో ఎంపీ కలివిడి తనాన్ని స్థానికులు అభినందించారు. ఎంపీ వెంట స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు నక్కల చిరంజీవియాదవ్‌, పబ్బతి హరికిషనగౌడ్‌, గుండెబోయిన సురేష్‌ ఉన్నారు.

Updated Date - May 01 , 2025 | 01:37 AM