ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అమ్మో... జూన్‌

ABN, Publish Date - Jun 01 , 2025 | 12:16 AM

ఎండల వేడి తగ్గి వాతావరణం చల్లబడుతుండగా, విద్యార్థుల తల్లిదండ్రులు, రైతులకు జూన్‌ ‘ఫీవర్‌’ మొదలైంది. వేసవి సెలవులు ముగి సి మరో 12 రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. పిల్లల చదువులు, పంటల సాగు ఖర్చు తలుచుకుంటే విద్యార్థుల తల్లిదండ్రులు, రైతులకు కంటిమీద కునుకు కరువవుతోంది.

ఈ నెల 12న పాఠశాలలు ప్రారంభం

ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాల్లో ఫీజుల మోత

పుస్తకాలు, యూనిఫాం, ఇతర సామగ్రి కొనుగోలుపై కలవరం

ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ ఉచితమే అయినా ప్రైవేట్‌పైనే మోజు

రైతులపై వానాకాలం పంటల సాగు భారం

ఆంధ్రజ్యోతి-మోత్కూరు: ఎండల వేడి తగ్గి వాతావరణం చల్లబడుతుండగా, విద్యార్థుల తల్లిదండ్రులు, రైతులకు జూన్‌ ‘ఫీవర్‌’ మొదలైంది. వేసవి సెలవులు ముగి సి మరో 12 రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. పిల్లల చదువులు, పంటల సాగు ఖర్చు తలుచుకుంటే విద్యార్థుల తల్లిదండ్రులు, రైతులకు కంటిమీద కునుకు కరువవుతోంది. పాఠశాలలు, కళాశాలల్లో డొనేషన్లు, వార్షిక ఫీజులు, హాస్టల్‌ ఫీజులు మొదలు యూనిఫాం, పుస్తకాలు, బ్యాగులు, బస్సు చార్జీలు తదితర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.

ప్రైవేట్‌ విద్యారంగంపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఏటా ఫీజులు, రవాణా, ఇతర ఖర్చులు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ ఉచితంగా ఇస్తున్నా, అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నా నాణ్యమైన బోధన లభించదేమోనన్న అనుమానంతో తల్లిదండ్రులు ఆ వైపు వెళ్లకుండా అప్పు చేసైనా సరే ప్రైవేట్‌ విద్య వైపే మొగ్గు చూపుతున్నారు.

ముగియనున్న వేసవి సెలవులు

మరో 12 రోజుల్లో వేసవి సెలవులు ముగిసి విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. ప్రైవేట్‌ కళాశాలలు, పాఠశాలల్లో అడ్మిషన్ల సందడి మొదలైంది. దీంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఖర్చుల ఆందోళన మొదలైంది. ప్రైవేట్‌ కళాశాలలు, పాఠశాలల్లో ఫీజుల మోత మోగుతున్నది. గ్రామీణ ప్రాంతా ల పాఠశాలల్లో నర్సరీ నుంచి పదో తరగతి వర కు ఆయా పాఠశాల, చదివే తరగతిని బట్టి రూ.15,000 నుంచి రూ.50,000 వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. పుస్తకాలు, యూనిఫాం, బ్యాగులు, బస్సు చార్జీలు అంటూ అదనంగా మోతమోగిస్తున్నారు. కొందరు ఎక్కువ వేతనం కలిగిన ఉద్యోగులు, ఇతర ఆదాయ వనరులు ఉన్నవారు హైదరాబాద్‌ లాంటి నగరాల్లో చదివిస్తున్నారు. ఇక అక్కడయితే నర్సరీకి రూ.40,000, 1వ తరగతికి రూ.లక్ష చొప్పున ఫీజు వసూలు చేస్తున్నారు. అడ్మిషన్‌ ఫీజు, యూనిఫాం, పుస్తకాలు తదితర ఖర్చులు అదనం.

ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లోనూ కళాశాల ను బట్టి ఏడాదికి రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. ఇక ఇంజనీరింగ్‌ కళాశాలల ఫీజులు కూడా భారీగానే పెరిగాయి. పిల్లలకు చదువు కొనాల్సిన పరిస్థితి ఏర్పడటంతో రైతులు, వ్యవసాయ కూలీలు, చిరుద్యోగులు, చిరు వ్యాపారులకు జూన్‌ వస్తుందంటేనే ఒంట్లో వణుకు పుడుతోంది.

రైతులపై సాగు భారం...

రైతులకు జూన్‌లోనే వానాకాలం పంటల సీజన్‌ ప్రారంభమవుతుంది. మెట్ట పంటలకు దుక్కులు సిద్ధం చేయడం, విత్తనాలు కొనడం, విత్తడానికి కూలి, వరి విత్తనాల కొనుగోలు, నార్లు పోయడం, నాట్లు, ఎరువులు తదితర ఖర్చులు జూన్‌లో ఉంటాయి. ఒక్కో రైతు జూన్‌లో సాగు విస్తీర్ణాన్ని బట్టి రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. చదువుకునే పిల్లలు ఉన్న రైతులకైతే ఇటు పంటల సాగు పెట్టుబడితో పాటు అటు పిల్లల చదువులకు అయ్యే ఖర్చు ఆందోళన కలిగిస్తోంది.

ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ ఉచితంగా ఇచ్చినా

ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం ఉచితంగా ఇచ్చినా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివితే పిల్లల భవిష్యత్‌ బాగుపడుతుందన్న భావనతో అటుగానే మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారెందరో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్న విషయాన్ని వారు మర్చిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన లభిస్తే అందులో విద్యాబోధన చేసే ఉపాధ్యాయులు వారి పిల్లలను ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలకు ఎందుకు పంపుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేస్తున్నా, ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరడం లేదంటున్నారు. తామే చదువుకోక చాకిరీ చేస్తున్నామని, కష్టమైనా, నిష్టూరమైనా పిల్లలను మంచిగా చదివి ంచాలంటూ ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల వైపు తల్లిదండ్రులు మొగ్గు చూ పుతున్నారు. ప్రభుత్వం ప్రైవేట్‌ పాఠశాలల ఫీజులను, ఇతర ఖర్చులు నియంత్రిస్తే కొంతమేలు జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

Updated Date - Jun 01 , 2025 | 12:16 AM