ముందుకు సాగని యూజీడీ పనులు
ABN, Publish Date - Apr 30 , 2025 | 12:55 AM
(ఆంధ్రజ్యోతి, మిర్యాలగూడ) మిర్యాలగూడ పట్టణంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులు ముందుకు సాగడం లేదు. అమృత-2 పథ కం కింద మిర్యాలగూడ అండర్‌గ్రౌండ్ పనులకు నిధులు మంజూరయ్యాయి.
(ఆంధ్రజ్యోతి, మిర్యాలగూడ)
మిర్యాలగూడ పట్టణంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులు ముందుకు సాగడం లేదు. అమృత-2 పథ కం కింద మిర్యాలగూడ అండర్‌గ్రౌండ్ పనులకు నిధులు మంజూరయ్యాయి. దీంతో పట్టణంలో ము రుగు నీరు కనుమరుగవుతుందని భావించినప్పటికీ పనులు ముందుకు సాగకపోవడంతో ఒకడుగు ముందుకు మూడడుగులు వెనక్కి అన్న చందంగా తయారైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 18 ఏళ్ల క్రితం ప్రారంభమైన అండర్‌గ్రౌండ్ డైనేజీ వ్యవస్థ నిర్మాణ పనులు నిధులు లేక అరకొర నిధులతో ఏడాది పనిచేస్తే మరో రెండుమూడేళ్ల కాలం వాటిని పట్టించుకోకపోవడంతో చేసిన కోట్లు వెచ్చించి చేసిన పనులు కూడా పనికిరాకుండా పోతున్నాయి.
నిధులు లేక..
మిర్యాలగూడ మునిసిపాలిటీలో పారిశుధ్యం, ప్ర జారోగ్యం దృష్టిలో ఉంచుకొని అండర్ గ్రౌండ్ డ్రైనే జీ నిర్మాణానికి 2007లో రూ.45.51 కోట్లు మంజూరు కావడంతో రాంకీ సంస్థ పనుల నిర్మాణ బాధ్యత చేపట్టింది. ప్రతిపాదిత నిఽధులు సరిపోవడం లేదని సదరు సంస్థ పనులను మధ్యలోనే వదిలివేయడంతో మరో సంస్థకు పనులను అప్పగించారు. 2014లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు రెండోసారి టెండర్లు పిలువగా కృషి ఇన్‌ఫ్రా టెండర్‌ను దక్కించుకుంది. రూ.33.1 కోట్ల పనులకు ప్రభుత్వం అనుమతించినప్పటికీ బడ్జెట్‌లో నిధులు కేటాయించక పోవడంతో పనులు నత్తనడకన సాగుతూ వచ్చాయి. కాగా ప్ర భుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ప ను లు నత్తనడకన కొనసాగుతూ వచ్చాయి. ఏళ్ల తరబడి పనులు కొనసాగడం వల్ల మొదట ఏర్పాటు చేసిన పైపులైన్లలో బురద, చెత్త పేరుకపోయి మరమ్మతులు చేయడానికి వీలులేనంతగా పాడయ్యాయి.
అమృత-2 లో రూ. 173.07 కోట్లు
మిర్యాలగూడ మునిసిపాలిటీలో చేపట్టిన అండర్‌గ్రౌండ్ డైనేజీ నిర్మాణ పనులకు అమృత-2 పథ కాని కి రూ. 173.07 కోట్లు మంజూరు చేసింది. గతంలో చేసిన పనులను అనుసంధానం చేసుకుంటూ నూతనంగా పైపులైన్లు, చాంబర్‌లు, లింకులు, ఎస్‌టీపీల నిర్మాణ పనులు చేపట్టారు. 26 కిలోమీటర్ల పూడిన పాత పైౖపులైన్లు, 14,000 జంక్షన్లు, 91 కి.మీ పైప్‌లైన క్లీనింగ్, 2300 మ్యానహోల్స్ మరమ్మతుల పనులు చేపట్టనున్నన్నారు. వీటితో పాటు 110 కి.మీ కొత్త పైపులైన నిర్మాణం, 4,400 మ్యానహోల్స్,18,333 జంక్షన చాంబర్స్, వాటర్ సీనరేజ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి 2024 ఏఫ్రిల్ నుంచి రెండేళ్ల కాలంలో పట్టణ ప్రజ లకు మురుగు కష్టాలు తొలగించేందుకు యూజీడి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు.
10 శాతం పూర్తి కాని పనులు
రెండేళ్ల కాలంలో పనులు పూర్తి చేయాలని సూచి ంచినప్పటికీ ఏడాది గడిచినా కాంట్రాక్టరు 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేదు.లింక్ కాల్వలు, కొత్త లైనలు 26 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 1.65 కిలోమీటర్ల మాత్ర మే నిర్మించారు.110 కి.మీ సీవర్ లైనకు 19.13 కి.మీ నిర్మాణం జరిపారు. 5440 మ్యానహూల్స్ నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు 655 నిర్మాణాలు పూర్తి చేశారు. మరమ్మతులు. 91.20 కి.మీ మెయినటెయిన్స వర్క్ పైపులైనుకు 16.41 కి.మీ మాత్రమే పూర్తయిందని 11.50, 5.45 ఎంఎల్‌డీ సామర్ధ్యం కలిగిన రెండు ఎస్టీపీలు నిర్మాణంలో పురోగతి లేదని అధికారులు అంటున్నారు. 2 ఏళ్లలో పనులు పూర్తి చేసే విధంగా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ సప్లయ్ నిర్మాణ పనులను దక్కించుకున్న కేఎనఆర్ సంస్థ నిర్మాణ పనులను పూర్తి చేయడంలో తీవ్రజాప్యం చేస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.
వాటర్ సప్లయ్ పనుల్లోనూ జాప్యం
అమృత-2 కింద మిర్యాలగూడ మునిసిపాలిటీ నీటి సరఫరాకు రూ.93.40 కోట్లు మంజూరు చేశారు. దీనిలో కేంద్ర ప్రభుత్వ వాటా 28.83 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 53.08 కోట్లు, అర్బన లోకల్ బాడి రూ.6.90 కోట్లు, 15వ ఫైనాన్స నుంచి 4.59 కోట్లు నిధులు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేశారు. కాగా ఇందుకోసం పట్టణంలో నిర్మించాల్సిన వాటర్ ట్యాం కుల్లో కొన్ని గ్రౌండ్ లెవల్ కూడా పూర్తి కాకపోవడం మరికొన్నింటికి స్థల సేకరణ కూడా చేయకపోవడంతో పనులు సకాలంలో పూర్తయే అవకాశం లేకుండా పోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికా రులు చొరవ తీసుకుని సకాలంలో పూర్తి చేయాలని కోరుతున్నారు.
పనుల్లో పురోగతి లేకుంటే చర్యలు తప్పవు
- ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో పురోగతి లేకుంటే చర్యలు తప్పవని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హెచ్చరించారు. స్థానిక మునిసిపల్ కార్యాలయంలో మంగళవారం వాటర్ సప్లయ్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులపై పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ కందుకూరి వెంకటేశ్వర్లుతో కలిసి మునిసిపల్, నిర్మాణ సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిధులు లేక పనులు సాగక యూజీడీ అస్త వ్యస్తంగా తయారైందని ప్రస్తుతం నిధులు మంజూరైన పనులు చేయకపోవడానికి గల కారణాలు ఏమిటని ప్రశ్నించారు. కొన్ని చోట్ల వాటర్ ట్యాంకుల నిర్మాణానికి స్థలం ఇవ్వలేదని, మరి కొన్ని చోట్ల 2 మీటర్లు అనుకుంటే 6-8 మ్ల లోతు తవ్వి బెడ్లు పర చాల్సి వస్తుందని ప్రాజెక్టు సంస్థ అధికారులు ఎమ్మెల్యే దృష్టి తీసుకురాగా ఎనఎస్పీ ఈఈతో మాట్లాడి కలెక్టర్ ఆదేశానుసారం వాటర్‌ట్యాంకు నిర్మాణానికి స్థలం ఇవ్వాలని సూచించారు. ఎం పీడీవో కార్యాలయంలో పార్క్ స్థలం నిరుపయోగంగా ఉందని అక్కడ ట్యాంక్‌నిర్మాణం చేపట్టేలా చూడాలని అన్నారు. మరో రెండు నెలల్లో పనుల్లో పురోగతి లేకుంటే తగిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. మునిసిపాలిటీని చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టలన్నారు. 9666290488 నెంబర్‌తో మున్సిఫల్ అధికారులు వాట్స్‌పగ్రూపు ఏర్పాటు చేస్తారని, కాలనీల్లో, కూడళ్లలో చెత్తపోగు కనిపించే పౌరులు తమ బాధ్యతగా ఫొటో తీసి గ్రూపులో పోస్ చేసి ఏరియాను తెలియజేయాలన్నారు. కిరాయి ఇండ్లలో నివసించేవారికి ఆకస్మాతుగా కుటుంబ సభ్యులు మరణిస్తే దినకార్యాలు చేస కోవడానికి వీలుగా హిందూ శ్మశాన వాటికలో ఏర్పాట్లు చేసేలా చూడాలని డీఈని ఆదేశించారు. పట్టణ అభివృద్ధ్దికి అధికారులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నల్లగొండ పబ్లిక్ హెల్త్ డిఈ మనోరమ, మునిసిపల్ డీఈ వెంకన్న, కేఎనఆర్ ప్రాజెక్టు మేనేజర్ చెన్నూరి బాపూజీ, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ప్రాజెక్టు డిజైనర్ సురే్‌షకుమార్, పబ్తిక్ మెల్త్ డిప్యూటీ కంట్రోలర్ రోహిత, పబి ్లక్ హెల్త్ ఏఈ సాయితేజ, పబ్లిక్ హెల్త్ డిజైనర్లు పాల్గొన్నారు.
Updated Date - Apr 30 , 2025 | 12:55 AM