ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వృక్షోరక్షతి రక్షితః

ABN, Publish Date - Apr 22 , 2025 | 12:02 AM

చెట్టును మనం రక్షిస్తే చెట్టు మనని రక్షిస్తుందనే నానుడికి చక్కని ఉదాహరణ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయంలోని వేపచెట్టు.

(ఆంధ్రజ్యోతి-మిర్యాలగూడ)

చెట్టును మనం రక్షిస్తే చెట్టు మనని రక్షిస్తుందనే నానుడికి చక్కని ఉదాహరణ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ కార్యాలయంలోని వేపచెట్టు. కార్యాలయాన్ని విస్తరించే క్రమంలో ఇక్కడి వేప చెట్టును నరికివేయకుండా దాని చుట్టూ ఫోర్టికోను నిర్మించారు. ఎత్తుగా పెరిగిన చెట్టు భవనంపై గొడుగులా విస్తరించి కార్యాలయానికి చల్లని నీడను ప్రసాదిస్తోంది. ఆ చెట్టు సమీపం లోనే ఫిర్యాదుల, వినతుల, రక్షణ కోసం అక్కడికి వచ్చే వారు వేచి ఉండేందుకు సిమెంట్‌ బెంచీలు ఏర్పాటు చేయడంతో శాఖలు విస్తరించిన వేపచెట్టు మరో చెట్టుతో కలిసిపోయి ఎండపొడ లేని చల్లని నీడ పరుస్తోంది. దీంతో కార్యాలయానికి వచ్చే వారు అలసటను మరిచి కొంతసేపు ఆహ్లాదంగా బెంచీలపై గడుపుతుంటారు.

Updated Date - Apr 22 , 2025 | 12:02 AM