నేడే మృగశిర కార్తె
ABN, Publish Date - Jun 08 , 2025 | 12:04 AM
మృగశిర కార్తె ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. వాతావరణమంతా చల్లబడింది. మృగశిర కార్తె మొదటిరోజున ప్రజ లు చేపలు తినటం ఆనవాయితీగా వస్తుంది. అందుకోసం ప్రజలు చేపలను కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు పరుగులు పెట్టారు.
చేపలకు భలే గిరాకీ
యాదాద్రి, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): మృగశిర కార్తె ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. వాతావరణమంతా చల్లబడింది. మృగశిర కార్తె మొదటిరోజున ప్రజ లు చేపలు తినటం ఆనవాయితీగా వస్తుంది. అందుకోసం ప్రజలు చేపలను కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు పరుగులు పెట్టారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం వేళల నుంచి రాత్రి వరకు చేపల విక్రయాలు ముమ్మరంగా కొనసాగాయి. మృగశిర కార్తె రోజున చేపలను తప్పనిసరిగా తినాలనే సంప్రదాయం ఉండడంతో పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా స్థాయికి తగినట్లుగా చేపలను కొనుగోలుచేశారు. మృగశిర కార్తె సందర్భంగా చేపల వ్యాపారులు ముందుగానే చుట్టుపక్కల చెరువుల్లోని చేపలను తెచ్చి నిల్వ చేసుకున్నారు. బొచ్చెలు కిలో రూ.250, రవ్వలు రూ.240, కొర్రమీను రూ.600, బురదమట్టలు 400, పచ్చిరొయ్యలు 600 చొప్పు న విక్రయించారు. డిమాండ్ పెరగటంతో చేపల వ్యాపారులు ఎప్పటికప్పుడు ధరలను పెంచి విక్రయాలు జరిపారు. దీంతో ప్రజలు కొంత ఇబ్బందికి గురయ్యారు.
Updated Date - Jun 08 , 2025 | 12:04 AM