సొంతింటి కల నెరవేర్చేందుకే..
ABN, Publish Date - Jun 08 , 2025 | 12:00 AM
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకే ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తోంద ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం : కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
భూదాన్‌పోచంపల్లి, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): పేదల సొంతింటి కల నెరవేర్చేందుకే ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తోంద ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భూదాన్‌పోచంపల్లి పట్టణంతోపాటు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 678మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు శనివారం పంపిణీ చేసి మాట్లాడారు. ‘గరీబీ హఠావో’ నినాదంతో నాడు ఇందిరాగాంధీ స్ఫూర్తితో నేడు సీఎం రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమ లు చేస్తున్నారన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మం జూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రమణి, ఎంపీడీవో రాపర్తి భాస్కర్, తహసీల్దారు పి.శ్రీనివా్‌సరెడ్డి, నాయబ్ తహసీల్దారు నాగేశ్వర్‌రావు, ఎంఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తడక వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు భారత లవకుమార్, డీసీసీ ఉపాధ్యక్షులురాఘవరెడ్డి, జిల్లా నాయకులు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
వలిగొండ: త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. శనివారం వలిగొండలో బక్రీద్ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - Jun 08 , 2025 | 12:00 AM