టోల్‌ప్లాజా వద్ద మూడు గంటల వేట..
ABN, Publish Date - May 09 , 2025 | 12:03 AM
భారీగా గంజాయి తరులుతుందనే సమాచారంతో మూడు గంటల పాటు విస్తృత తనిఖీలు చేపట్టినా పోలీసులకు ఎటువంటి ఆచూకీ లభించలేదు.
గంజాయి సరఫరా సమాచారంతో మొహరించిన పోలీసులు
అయినా లభించని ఆచూకీ
కేతేపల్లి, మే 8 (ఆంధ్రజ్యోతి) : భారీగా గంజాయి తరులుతుందనే సమాచారంతో మూడు గంటల పాటు విస్తృత తనిఖీలు చేపట్టినా పోలీసులకు ఎటువంటి ఆచూకీ లభించలేదు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి మీదుగా గంజాయి తరలుతుందన్న సమాచారం పోలీసులకు వచ్చింది. దీంతో నల్లగొండ జిల్లా కేతేపల్లి సమీపంలోని టోల్‌ప్లాజా వద్దకు జిల్లాలోని నల్లగొండ, చండూరు, నకిరేకల్ డివిజన్లకు చెందిన ఎక్సైజ్, ఎనఫోర్స్‌మెంట్ పోలీసు సిబ్బంది పెద్దఎత్తున గురువారం సాయంత్రం 4గంటలకు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్లే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వదిలారు. రాత్రి 7 గంటల వరకు నిర్వహించిన ఈ వాహన తనిఖీలు కొనసాగాయి. అయినప్పటికీ గంజాయి పట్టుబడలేదని సమాచారం.
Updated Date - May 09 , 2025 | 12:03 AM