వేర్వేరుచోట్ల ముగ్గురి బలవన్మరణం
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:13 AM
ఆర్థిక ఇబ్బందులతో ఓ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చౌటుప్పల్ రూరల్, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి) : ఆర్థిక ఇబ్బందులతో ఓ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ సీఐ మన్మధకుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ రాష్ట్రం కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుడ్డవరం గ్రామానికి చెందిన పందేటి చలపతిరావు(38) 20 ఏళ్లుగా స్థానిక దివీస్ పరిశ్రమలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి గణేశనగర్‌లో నివాసముంటున్నాడు. చలపతిరావుకు ఇటీవల ఆర్థికఇబ్బందులు ఎక్కువ కావడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో మనస్తాపానికి గురైన చలపతిరావు మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. అనంతరం కుటుంబ సభ్యులు గమనించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. తండ్రి వీరరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చలపతిరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Updated Date - Apr 17 , 2025 | 12:13 AM