ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేయాలి

ABN, Publish Date - Jul 19 , 2025 | 12:52 AM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల ను వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు అన్నారు. మండలకేంద్రంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటి నిర్మాణ పనులు ఎలా సాగుతున్నాయని లబ్ధిదారుల ను అడిగి తెలుసుకున్నారు.

అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు

మోటకొండూరు, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల ను వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు అన్నారు. మండలకేంద్రంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటి నిర్మాణ పనులు ఎలా సాగుతున్నాయని లబ్ధిదారుల ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అవసరమైన ఇసుక, మట్టి కొరత లేకుండా చూడాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. అనంతరం మండలకేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీచేసి హాజరు పట్టికను పరిశీలించారు. ఉపాధ్యాయురాలు అత్యవసర పరిస్థితుల్లో ఇంటికి వెళితే తప్పనిసరిగా సీఎల్‌ పెట్టాలి తప్ప మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌లో రాయకుడదని సూచించారు. బా లికల పాఠశాలలో పురుషులు ఉండడం ఏమిటని ప్రశ్నించారు. కంప్యూటర్‌ అపరేటర్‌ను వెంటనే ఇక్కడి నుంచి వేరే చోటికి పంపించాలని సంబంధిత అధికారులను అదేశించారు. విద్యార్థులకు సెల్‌ఫోన్లు ఇవ్వొద్దని తెలిపారు. వి ద్యార్థుల ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలని ఏఎన్‌ఎంకు సూచించారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలలోని సౌకర్యాలపై ఆరా తీశారు. ఆయనవెంట తహసీల్దార్‌ నాగదివ్య, ఎంపీవో చంద్రశేర్‌, ప్రిన్సిపాల్‌ జ్యోతి, ఆర్‌ఐ ఆసిఫ్‌, బుగ్గ కొముర య్య, భూమండ్ల శ్రీనివాస్‌, మధు, గౌతమ్‌, శ్రీశైలం, ఉమేష్‌ ఉన్నారు.

యాదగిరిగుట్ట రూరల్‌: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి కావల్సిన సామగ్రి తక్కువ ధరకే ఇవ్వాలని భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం గుట్ట మునిసిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇసుక, సిమెంట్‌, కంకర, ఇనుము ధరల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ డివిజన్‌వ్యాప్తంగా భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. ఆయనవెంట తహసీల్దార్‌ గణే్‌షనాయక్‌, మునిసిపల్‌ కమిషనర్‌ మిర్యాల లింగస్వామి తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 12:52 AM