ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బీబీనగర్‌ చెరువుకు కాలుష్య ముప్పు తప్పినట్టే!

ABN, Publish Date - Jul 28 , 2025 | 12:28 AM

తాగునీటి వనరు అయిన బీబీనగర్‌ పెద్ద చెరువుకు కాలుష్య ముప్పు తొలగనుంది. చెరువును కలుషితం చేస్తున్న రెండు ప్రధాన మురుగు కాల్వల మళ్లింపు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.

కలుషితానికి కారణమవుతున్న మురుగు కాల్వల మళ్లింపు

(ఆంధ్రజ్యోతి,బీబీనగర్‌): తాగునీటి వనరు అయిన బీబీనగర్‌ పెద్ద చెరువుకు కాలుష్య ముప్పు తొలగనుంది. చెరువును కలుషితం చేస్తున్న రెండు ప్రధాన మురుగు కాల్వల మళ్లింపు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఇటీవలే హెచ్‌ఎండీఏ నిధులు రూ. 16.8కోట్లు మంజూరు చేయించగా, అందు లో బీబీనగర్‌ పట్టణాభివృద్ధికి రూ.3. 19 కోట్లు కేటాయించారు. వీటిలో పెద్ద చెరువు ను కలుషితం చేస్తున్న మురుగు కాల్వల మ ళ్లింపు పనులకు రూ.కోటి వెచ్చించనున్నారు.

బీబీనగర్‌ బైపాస్‌ రోడ్డులోని పాత లక్ష్మీ వి లాస్‌ హోటల్‌ నుంచి జాతీయ రహదారి వెంట తహసీల్దార్‌ కార్యాలయం వరకు సుమారు 1.2 కిలోమీటర్ల పొడవున మురుగు కాల్వలను మళ్లించనున్నారు. దీని కోసం పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారి వెంట సుమారు 70ఎకరాల్లో బీబీనగర్‌ చెరువు విస్తరించి ఉంది. ఈ చెరువు వర్షాధారంగా నిండుతుంది. వర్షాలు బాగా కురిస్తే ఎగువ నుంచి వచ్చే రెండు వరద కాల్వల ద్వారా చెరువులోకి నీరు చేరుతుంది. శామీర్‌పేట చెరువు నుంచి వచ్చే చిన్నేటివాగు పొంగిపొర్లినప్పుడు వరద వడపర్తి చెరువుకు అక్కడి నుంచి దిగువనున్న జైనపల్లి చెరువుకు, అటు నుంచి బీబీనగర్‌ చెరువుకు చేరుతుంది. ఏకధాటిగా నెల రోజులు వరద వస్తే బీబీనగర్‌ చెరువు పూర్తిగా నిండితే ఐదేళ్లపాటు తాగు, సాగు నీటికి కొరత ఉండదు.

చెరువులోకి చేరుతున్న మురుగు కాల్వలు

మూసీ కాలుష్య జలాలకు దూరంగా, కేవ లం వర్షాధారంగా నిండే బీబీనగర్‌ చెరువుకు తాగునీటి చెరువుగా గుర్తింపు ఉంది. కాగా, కొన్నేళ్లుగా చెరువులోకి పట్టణంలోని మురుగు నీరు వచ్చి చేరడం ప్రారంభమైంది. పాత బీబీనగర్‌ గ్రామంలోని ప్రధాన వీధుల్లో మురుగు కాల్వలు అస్తవ్యస్తంగా మారగా, జనావాసాల నుంచి వచ్చే ప్రధాన మురుగు కాల్వలు రెండు నేరుగా పెద్ద చెరువులోకి వచ్చి చేరుతున్నాయి. దీంతో పాటు టన్నుల కొద్దీ చెత్తాచెదారంతో కూడిన వ్యర్థాలు చెరువులోకి చేరి నీరు కలుషితమవుతోంది. ఫలితంగా చెరువు పరిసరాలు మురికికూపంగా మారి దుర్వాసన వెదజల్లుతోంది. ఇలాగే వదిలేస్తే రానున్న రోజుల్లో కాలుష్యకాసారంలా మారే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘తాగునీటి చెరువుకు కాలుష్య ముప్పు’ శీర్షికరన ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ మినీలో కథనం కూడా ప్రచురితమైంది. దీంతో స్పందించిన స్థానిక అధికార పార్టీ నేతలు సమస్యను ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా హెచ్‌ఎండీఏ నిధులు మంజూరుచేయించారు. మురుగు కాల్వల మళ్లింపుతోనే శాశ్వత పరిష్కారమని అధికారులు కార్యాచరణ ప్రారంభించారు.

రూ. కోటి వ్యయంతో మురుగు కాల్వల మళ్లింపు: గోళి పింగల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత

చెరువు కలుషితానికి కారణమైన రెండు మురుగు కాల్వలను గుర్తించాం. సమస్యను ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి పట్టణానికి కేటాయించిన హెచ్‌ఎండీఏ నిధులు రూ.3.19కోట్లలో మురుగు కాల్వల మళ్లింపు పనులకు రూ.కోటి ఖర్చు చేయాలని సూచించారు. దీంతో సంబంధిత శాఖ అధికారులు శాశ్వత పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందిస్తున్నారు. త్వరలోనే కాల్వల మళ్లింపు పనులు ప్రారంభిస్తాం.

Updated Date - Jul 28 , 2025 | 12:28 AM