గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం
ABN, Publish Date - Jul 10 , 2025 | 12:39 AM
గ్రామాల సమగ్రాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో, పట్టణంలోని పలు వార్డుల్లో రూ.3.58 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
భువనగిరి ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి
భూదాన్‌పోచంపల్లి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): గ్రామాల సమగ్రాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో, పట్టణంలోని పలు వార్డుల్లో రూ.3.58 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నియోజకవర్గానికి మొత్తం మంజూరైన నిధులు నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం ఒక్క భూదాన్‌పోచంపల్లి మండలంలో రూ. 17కోట్ల నిధులు హెచ్‌ఎండీఏ మంజూరు చేసిందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పా లనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేడు అన్ని వర్గాల అభ్యున్నతికోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నా రు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్‌రెడ్డి, మునిసిపల్ కమిషనర్ అంజన్‌రెడ్డి, ఎంపీడీవో రాపర్తి భాస్కర్, తహసీల్దా రు పి.శ్రీనివా్‌సరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు తడక వెంకటేష్. డీసీసీ ఉపాధ్యక్షుడు కళ్లెం రాఘవరెడ్డి, జిల్లా నాయకులు సామ మధుసూదన్‌రెడ్డి, మర్రి నర్సింహారెడ్డి, ఉప్పునూతల వెంకటే్‌షయాద వ్, కొట్టం కరుణాకర్‌రెడ్డి, పక్కీరు మల్లారెడ్డి, మండ ల కాంగ్రెస్ అధ్యక్షుడు పాక మల్లే్‌షయాదవ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు భారత లవకుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అంజిరెడ్డి, లాలయ్య పాల్గొన్నారు.
Updated Date - Jul 10 , 2025 | 12:39 AM