కాసులను కురిపిస్తున్న మట్టి మాఫియా
ABN, Publish Date - May 06 , 2025 | 11:58 PM
మట్టి మాఫియా కాసులు కురిపిస్తోంది. అధికారం మాటున అక్రమ రవాణా జరుగుతోంది. అయినా మైనింగ్ శాఖ, రెవెన్యూ శాఖలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొంతమంది అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే అక్రమ రవాణా
అనుమతులు లేకుండా తవ్వకాలు
కొండగట్టులను తవ్వేస్తున్న వైనం
మట్టి మాఫియా కాసులు కురిపిస్తోంది. అధికారం మాటున అక్రమ రవాణా జరుగుతోంది. అయినా మైనింగ్ శాఖ, రెవెన్యూ శాఖలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ యంత్రాంగం కళ్లెదుటే పెద్దసంఖ్యలో వాహనాల్లో మట్టి అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా స్థానికుల ఫిర్యాదుతో నాలుగు మట్టి టిప్పర్ లారీలను సీజ్ చేశారు.
(ఆంధ్రజ్యోతి- హుజూర్‌నగర్)
అధికార పార్టీకి చెందిన కొంతమం ది కీలక నాయకులు మట్టిదందాను యథేచ్ఛగా చేస్తున్నారు. ఏడాదిగా హుజూర్‌నగర్, చిలుకూరు గుట్ట ప్రాంతాలను కొల్లగొడుతున్నారు. ప్రతిరోజూ 100 టిప్పర్ల పైనే విక్రయాలు జరుపుతున్నారు. ఎటుచూసినా సుమారు 50 కిలోమీటర్ల మేర ఈ మట్టిమాఫియా అక్రమ రవాణా జరుగుతోంది. ఏ పోలీసు అధికారి కానీ, మైనింగ్ అధికారులు కానీ కన్నెత్తి చూడటంలేదు. బడా రాజకీయ నేతల కనుసన్నల్లోనే ప్రతి రోజూ 100 ట్రిప్పుల మట్టి విక్రయాలు సాగుతోంది. ఏడు మండలాల్లో ఎక్కడ వెంచర్లు వేసినా, ఎక్కడ రైస్‌మిల్లులు నిర్మించినా ఈ అధికార పార్టీకి చెందిన నాయకులు మాత్రమే మట్టి రవాణాచేస్తుండడం గమనార్హం. గుట్టలను కొల్లగొడుతున్న కొంతమంది నాయకులు ప్రతీ టిప్పర్‌కు రూ.5వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రతినెలా వివిధ శాఖల అధికారులకు పెద్దమొత్తంలో లం చాలు ముట్టజెబుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఓ అధికారికి నెలకు రూ.50 వేలు
నియోజకవర్గానికిచెందిన ఒక పోలీ్‌సస్టేషన్ హౌస్ అ ధికారికి మాత్రమే ప్రతినెలా రూ.50వేలు అధికార పార్టీకిచెందిన నాయకులు ముట్టచెబుతున్నట్లు ఆరోపణ లు ఉన్నాయి. మట్టి, ఇసుక లాంటి ఏఅక్రమ వ్యాపారం చేసి నా అతను పూర్తి సహకారం అందిస్తున్నట్లు సమా చా రం. అక్రమ రవాణాపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే మైనిం గ్ అధికారులకు చెప్పుకోండి, మేం కేసులు చేయమని తెగేసి చెబుతున్నట్లు తెలిసింది. మంగళవారం స్థానికుల ఫిర్యా దు మేరకు రెవెన్యూ అధికారులు పట్టణంలో నాలుగు టిప్పర్లు పట్టుకుని ఒక అధికారికి అప్పగించేందుకు ప్ర యత్నించారు. ఇది తమ శాఖ పరిధి కాదంటూ లారీల ను వెనక్కి పంపినట్లు ఆరోణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీలోని కీలక నేతలు సిండికేట్‌గా మారి మట్టి, ఇసుక మాఫియాను నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఏడాదికాలంగా కోట్లాది రూపాయల ఇసుక, మట్టి మాఫియా దందా సాగిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని ప్రజానీకం ఆరోపిస్తోంది.
నాలుగు టిప్పర్లు సీజ్..
పట్టణ సమీపంలోని చిలుకూరు గుట్టల నుంచి వెంచర్లకు, రైస్ మిల్లులు నిర్మాణాలకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తరలిస్తున్న నాలుగు టిప్పర్లను సీజ్‌చేశారు. ఒక శాఖ అధికారికి టిప్పర్లను అప్పగించేందుకు ప్రయత్నించగా అతను మైనింగ్ శాఖకు అప్పగించాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో... ఆ టిప్పర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు.
సోషల్‌మీడియా నిర్వాహకుల బెదిరింపులు
మట్టి మాఫియా దందా చేస్తున్న నేతల నుంచి పట్టణానికి చెందిన కొంతమంది సోషల్ మీడియా వ్యక్తులు లక్షల రూపాయలను డిమాండ్ చేసినట్లు తెలిసింది. గత ఏడాది కాలంగా మట్టి దందా చేస్తున్న అధికార పార్టీ నాయకులను సోషల్ మీడియాకు చెందిన కొంతమంది ప్రతీ వెంచర్, ప్రతి రైస్‌మిల్లు, కాంట్రాక్టర్లను బెదిరించి లక్షలు వసూలుచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ మాఫియాకు కొంతమంది సోషల్ మీడియాను నడిపిస్తున్న వారికి గతంలో కొన్ని వ్యవహారాల్లో పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించగా తిరిగి ప్రతీ మట్టి తరలింపులోనూ ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.
నాలుగు టిప్పర్లు సీజ్ చేశాం
హుజూర్‌నగర్ ప్రాంతంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న నాలుగు టిప్పర్లను సీజ్ చేశాం. చిలుకూ రు గుట్టల నుంచి హుజూర్‌నగర్‌కు అక్రమంగా మట్టి ని తరలిస్తున్నారన్న స్థానికుల ఫిర్యాదుమేరకు పరిశీలించాం.టిప్పర్లను సీజ్ చేసి కేసులు నమోదు చేశాం.
- నాగార్జునరెడ్డి, తహసీల్దార్
Updated Date - May 06 , 2025 | 11:58 PM