ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పరిషత్‌ ఎన్నికలకు తొలి అడుగు

ABN, Publish Date - Jul 17 , 2025 | 12:20 AM

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో తొలి అడుగు పడింది. రాష్ట్రంలో జిల్లా పరిషత్‌ అధ్యక్ష,మండల పరిషత్‌ అ ధ్యక్ష పదవులతో పాటు, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సంఖ్యను రాష్ట్రప్రభుత్వం ఖరారు చేసింది. ఈమేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ బుధవారం వివరాలు వెల్లడించింది.

ప్రాదేశిక నియోజకవర్గాల సంఖ్య ఖరారు

ఉమ్మడి జిల్లాలో 73 జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు

ఎంపీటీసీ స్థానాలు 766

నల్లగొండ,జూలై 16 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో తొలి అడుగు పడింది. రాష్ట్రంలో జిల్లా పరిషత్‌ అధ్యక్ష,మండల పరిషత్‌ అ ధ్యక్ష పదవులతో పాటు, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సంఖ్యను రాష్ట్రప్రభుత్వం ఖరారు చేసింది. ఈమేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ బుధవారం వివరాలు వెల్లడించింది. ఉమ్మడి జిల్లాలో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లా పరిషత్‌ అధ్యక్ష పదవులతో పాటు 73 జడ్పీటీసీ స్థానాలు, మరో 73 ఎంపీపీ పదవులను ఖరారు చేసింది. మొత్తం 766 ఎంపీటీసీ స్థానాలను ప్రకటించింది. ప్రతి రెవెన్యూ మండలాన్ని ఒక జడ్పీటీ సీ (జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గం) స్థానంగా పరిగణించగా, ప్రతీ మండలానికి ఒక మండల పరిషత్‌ అధ్యక్ష పదవిని ఖరారు చేస్తూ ప్రకటించింది. ప్రతీ మండల పరిషత్‌కు కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండేలా పునర్విభజన చేసింది.

జిల్లా జడ్పీటీసీ / ఎంపీటీసీ

ఎంపీపీలు స్థానాలు

నల్లగొండ 33 353

సూర్యాపేట 23 235

యాదాద్రి 17 178

మొత్తం 73 766

Updated Date - Jul 17 , 2025 | 12:20 AM