ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సమాజసేవకు నిర్ణయం సంతోషకరం

ABN, Publish Date - May 13 , 2025 | 12:36 AM

సమాజ సేవ కోసం స్వగ్రామానికి ఆసుపత్రి భవనం నిర్మిస్తామని కానుగంటి నర్సింహారెడ్డి-పద్మ దంపతులు ముందుకు రావడం సంతోషకరమని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు అన్నారు.

కానుగంటి నర్సింహారెడ్డి-పద్మ దంపతులను సన్మానిస్తున్న కలెక్టర్‌

భువనగిరి (కలెక్టరేట్‌), మే 12 (ఆంధ్రజ్యోతి): సమాజ సేవ కోసం స్వగ్రామానికి ఆసుపత్రి భవనం నిర్మిస్తామని కానుగంటి నర్సింహారెడ్డి-పద్మ దంపతులు ముందుకు రావడం సంతోషకరమని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు అన్నారు. మండలంలోని రఘునాధపురం గ్రామానికి చెందిన కానుగంటి నర్సింహారెడ్డి-పద్మ దంపతులు సోమవారం కలెక్టర్‌ను కలిసి ప్రభుత్వం తరపున స్థలం ఇస్తే తమ సొంత ఖర్చులతో ఆసుపత్రి భవనం నిర్మిస్తామని తెలిపారు. తాము పుట్టి పెరిగిన ఊరు రఘునాథపురం గ్రామ పరిసరాల్లో ఎకరం భూమి వరకు కేటాయిస్తే ఎంత ఖర్చు అయినా భవనాన్ని నిర్మించి ఇస్తామని, భూమి కేటాయించాలని కోరడంతో ప్రభుత్వ పరంగా సాధ్యాసాధ్యాలను పరిశీలించి, తప్పకుండా వారి ఆలోచనలను ముందడుగులో పెడతామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. అనంతరం వారిని కలెక్టర్‌ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎన.శోభారాణి, సూపరింటెండెంట్‌ రవికుమార్‌ తదితరులున్నారు.

Updated Date - May 13 , 2025 | 12:36 AM