అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే ఆదర్శం
ABN, Publish Date - Apr 19 , 2025 | 12:05 AM
దేశంలో ప్రతి ఒక్కరూ సమానంగా జీవించే లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే నిలిచిందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన చైర్మన బక్కి వెంకటయ్య అన్నారు.
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన చైర్మన బక్కి వెంకటయ్య
సూర్యాపేట టౌన, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి) : దేశంలో ప్రతి ఒక్కరూ సమానంగా జీవించే లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే నిలిచిందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన చైర్మన బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం చివ్వెంల మండలం మున్యానాయక్‌తండా పం చాయతీ పరిధిలోని పీక్లాతండాలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. అంబేడ్క ర్ రచించిన రాజ్యాంగంతోనే దేశ ప్రజలందరికీ సమానఫలాలు అందుతున్నాయన్నారు. అంబేడ్కర్ ప్రపంచ మేధావిగా అందరి మన్నలను పొంది ప్రపంచదేశాల్లో దేశ ఖ్యాతిని పెంచారన్నారు. నేటి యువత అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించేలా కష్టపడి చదువుకోవాలన్నారు. యువత చెడు అలవాట్లు, వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. అంబేడ్కర్ తన కుటుంబం కన్నా చేసి దేశ ప్రజల సంక్షేమం కోసం, దేశం కోసం ఎనలేని కృషి చేశారని తెలిపారు. దేశప్రజలంతా రా జ్యాంగాన్ని చదివి అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రభుత్వం అందజేసే అనేక సంక్షేమ పథకాలు ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రైకార్ మాజీ చైర్మన ఇస్లావత రామచంద్రనాయక్, జిల్లా షెడ్యూల్ కులాల అధికారులు కే శంకర్, లత, తహసీలా ్దర్ కృష్ణయ్య, సూరాపేట రూరల్ సీఐ రాజశేఖ ర్, ఎస్‌ఐ మహేశ్వర్, సామాజిక కార్యకర్త నర్సింహారావు, మాజీ సర్పంచ బికారి, మాజీ ఎంపీటీసీ సుశీల, సాగర్, విగ్రహదాత సురేష్, విద్యార్థి సేన నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Apr 19 , 2025 | 12:05 AM