హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
ABN, Publish Date - Apr 25 , 2025 | 12:27 AM
నిడమనూరు, తిరుమలగిరి(సాగర్), ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి నోముల భగత్ అన్నారు.
గురువారం తిరుమలగిరి(సాగర్ ), నిడమనూరు, మాడ్గులపల్లి బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సన్నాహాక సమావేశాల్లో వారు మాట్లాడారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రుణమాఫీ, రైతుభరోసా అమలులో ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన ప్రజలు మళ్లీ కేసీఆర్ వైపు చూస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించే సభకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతున్నందున మండలం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలి రావాలన్నారు. కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ మండలాధ్యక్షులు పగిళ్ల సైదులు, తాటిసత్యపాల్, పిడిగం నాగయ్య, మాజీ జడ్పీటీసీ ఆంగోతు సూర్య భాష్యనాయక్, నాయకులు బొల్లం రవి, నల్లబోతు వెంకటేశ్వర్లు, కేశ శంకర్, పిల్లి రమేష్, సత్యనారాయణరెడ్డి, చిలుముల సంతోష్, గుడిసె శంకర్, భాస్కర్ బానావత్ బాబురావునాయక్, కేతావత్ భిక్షానాయక్, శ్రీనివా్‌సరెడ్డి, రమణరాజు పాల్గొన్నారు.
Updated Date - Apr 26 , 2025 | 04:41 PM