నవవధువు బలవన్మరణం
ABN, Publish Date - May 05 , 2025 | 12:05 AM
హుజూర్‌నగర్, మే 4 (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులను వదిలి అత్తగారింటికి వెళ్లలేక ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. వివాహమైన ఐదు రోజులకే బలవన్మరణానికి పాల్పడటంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఫ ఐదురోజుల క్రితమే వివాహం
హుజూర్‌నగర్, మే 4 (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులను వదిలి అత్తగారింటికి వెళ్లలేక ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. వివాహమైన ఐదు రోజులకే బలవన్మరణానికి పాల్పడటంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎస్‌ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం హుజూర్‌నగర్ పట్టణంలోని మట్టపల్లి రోడ్డు కొత్వాల్ గడ్డలో నివాసం ఉంటున్న షేక్ ఖాసింబీ, సైదాకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సైదా ఆటో నడుపుతుండగా, భార్య ఖాసింబీ కూలి పనులు చేస్తుంది. కుమార్తె హసీనా(19) ఇంటర్మీడియెట్ పూర్తిచేయగా ఈ ఏడాది ఏప్రిల్ 30న చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన షేక్ యూసుఫ్‌తో వివాహం చేశారు. మే 3వ తేదీన భర్తతో కలిసి హసీనా పుట్టింటికి వచ్చింది. ఆదివారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో స్నానం చేసేందుకు వెళ్లింది. ఎంతసేపటికి హసీనా బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన తలి ్లదండ్రులు తలుపు కొట్టి చూడగా ఇనుపకడ్డీకి ఉరేసుకొని కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులను విడిచి అత్తగారింటికి వెళ్లటం ఇష్టం లేదని కుమార్తె తమ వద్ద ఆవేదన వ్యక్తంచేసిందని తల్లి ఖాసింబీ కన్నీటి పర్యంతమయ్యారు. హసీనా తల్లి ఖాసింబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Updated Date - May 05 , 2025 | 12:05 AM