ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం

ABN, Publish Date - Jul 04 , 2025 | 12:21 AM

కాంగ్రెస్‌ ప్రజాపాలన ప్రభుత్వంలో పేదలకు పలు అభివృ ద్ధి, సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ముందుకు పోతున్నామని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు.

ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

తుర్కపల్లి, జూలై 3(ఆంద్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రజాపాలన ప్రభుత్వంలో పేదలకు పలు అభివృ ద్ధి, సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ముందుకు పోతున్నామని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు. గురువారం మండలంలో సుడిగా లి పర్యటన చేపట్టి సూక్యతండ(పెద్దతండ), బాబు ల్‌ నాయక్‌ తండ, ధర్మారం, ముల్కలపల్లి గ్రామా ల్లో అంగన్‌వాడీ కేంద్రాలకు, బీల్యానాయక్‌ తండలో ఎస్టీ కమ్యూనిటీ, దత్తాయపల్లిలో గౌడ కమ్యూనిటీ హాల్‌, మల్కాపూర్‌ వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించా రు. గుజ్జవానికుంటలో నూతన పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపనచేసి మాట్లాడారు. కాం గ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే పేద ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆలేరు నియోజకవర్గంలో కుల భవనాలకు అధిక ప్రాధాన్యమిస్తూ సీడీపీ నిధులను మంజూరుచేసి భవన నిర్మాణాల కు శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. సీఎం రే వంత్‌రెడ్డి, మంత్రుల సహకారంతో ఆలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే పేదలకు సన్న బి య్యం ఇస్తున్న చరిత్ర కాంగ్రె్‌సదేనన్నారు. అర్హులైన పేదలందరికీ సొంతంటి కలను నెరవేరుస్తూ నూత న రేషన్‌ కార్డులను మంజూరు చేస్తున్నామన్నారు. జై బాపు, జై భీం, జై సంవిధాన్‌ కార్యక్రమంలో భా గంగా ఈ నెల 4న హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా బీల్యానాయక్‌ తం డనుంచి కర్షలగడ్డ వరకు చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. మండలంలోని బాబుల్‌నాయక్‌తండ, ధర్మారం ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించారు. తుర్కపల్లి మండలం దత్తాయపల్లిలో గౌడసంఘం కమ్యూనిటీహాల్‌ శంకుస్థాపన సందర్భంగా కల్లు తాగి, కాసేపు గీత కార్మికులతో ముచ్చటించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ దేశ్యానాయక్‌, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఆలే రు మార్కెట్‌ చైర్మన్‌ అయినాల చైతన్య మహేందర్‌రెడ్డి, నార్ముల్‌ మదర్‌ డెయిరీ చైర్మన్‌ గుడిపాటి మఽ దుసూదన్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ధనావతు శంకర్‌నాయక్‌, పార్టీ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చాడ భాస్కర్‌రెడ్డి, ఎరుకల వెంకటేశ్‌గౌడ్‌, మాజీ ఎంపీటీసీలు ధనావతు మోహన్‌బాబు, కా నుగంటి శ్రీనివాస్‌ యాదవ్‌, ఏఎంసీ డైరెక్టర్‌ పట్టునాయక్‌, నాయకులు ధనావతు భాస్కర్‌నాయక్‌, వెంకన్న, బోరెడ్డి హన్మంతరెడ్డి, భూక్య రాజారాం నాయక్‌, దేవరుప్పల అయిలయ్య పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 12:21 AM