ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపాధ్యాయుల తాత్కాలిక సర్దుబాటు షురూ

ABN, Publish Date - Jul 19 , 2025 | 12:44 AM

ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ జిల్లాలోమొదలైంది. ఉపాధ్యాయులున్న చోట విద్యార్థులు లేక, విద్యార్థులు ఉన్న చో ట ఉపాధ్యాయులు లేక ప్రభుత్వ విద్య మిథ్యలా మారింది. దీం తో ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ఉపాధ్యాయుల ఖాళీలు, పాఠశాలల వారీగా సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత లేకుండా చూస్తోంది.

మొదటగా ఉన్నత పాఠశాలలు

రెండో దశలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో

సుమారు 200 మంది ఉపాధ్యాయుల సర్దుబాటుకు అవకాశాలు

(ఆంధ్రజ్యోతి-భువనగిరి టౌన్‌): ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ జిల్లాలోమొదలైంది. ఉపాధ్యాయులున్న చోట విద్యార్థులు లేక, విద్యార్థులు ఉన్న చో ట ఉపాధ్యాయులు లేక ప్రభుత్వ విద్య మిథ్యలా మారింది. దీం తో ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ఉపాధ్యాయుల ఖాళీలు, పాఠశాలల వారీగా సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత లేకుండా చూస్తోంది. ఇందులో భాగంగా ఉపాధ్యాయుల తా త్కాలిక సర్దుబాటు ప్రక్రియను జిల్లా విద్యాశాఖ ప్రారంభించింది.

జిల్లాలో తొలుత ఉన్నత పాఠశాలలు, అనంతరం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సర్దుబాటు ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించా రు. అయితే ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల సర్దుబాటు డీఈవో కార్యాలయం పరిధిలో కొనసాగుతుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సర్దుబాటు జాబితాను ఆయా మండలాల ఎంఈవోలు సిద్ధం చేయాల్సి ఉంటుంది.ఈ మేర కు ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటుకు సుమారు 40మంది ఉపాధ్యాయులతో జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఇటీవల చేసిన పదోన్నతుల ప్రకటన కార్యరూపం దాలి స్తే సర్దుబాటు జాబితా పెరిగే అవకాశాలుంటాయని తెలుస్తుంది. హైస్కూళ్ల ఉపాధ్యాయుల సర్దుబాటు పూర్తికాగానే మిగతా పాఠశాలలకు చెందిన సుమారు 150మందికి పైగా ఉపాధ్యాయులు సర్దుబాటు ప్రక్రియను ఎంఈవోల జాబితాల ఆధారంగా చేపట్టనున్నారు. అయితే ప్రతీనెల ఉండే ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణలతో అయ్యే ఖాళీల భర్తీకి, సిలబస్‌ పూర్తికి ఏడాది పొడవునా తాత్కాలిక సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతుందని అధికారుల అంటున్నారు.

జిల్లాలో ఇలా..

జిల్లాలో గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెరిగినట్టు అధికారులు పేర్కొంటున్నారు. 2025-2026 విద్యా సంవత్సరానికి ఇప్పటివరకు మొదటి తరగతిలో 2,822 మంది, రెండు నుంచి పదో తరగతి వరకు 2,976 మంది మొత్తంగా 5,798 మంది విద్యార్థులు చేరారు. అయితే ప్రభుత్వ యాజమాన్య ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ మేర కు జిల్లాలో 754 ప్రభుత్వ, ప్రభుత్వ యా జమాన్య గురుకుల తదితర పాఠశాలల్లో 48,217 మంది, 159 ప్రైవేట్‌ పాఠశాలల్లో, 51, 517 మంది మొత్తంగా 913 పాఠశాలల్లో 99,734 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

పారదర్శకంగా నిర్వహించాలంటున్న ఉపాధ్యాయులు

సర్దుబాటు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఉపాధ్యాయులు అంటున్నారు. అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా వాస్తవ పరిస్థితులు ఆధారంగానే సర్దుబాటు ను చేపడితేనే విద్యార్థులకు అన్ని పాఠ్యాంశాల బోధన అందుబాటులోకి వస్తుందని, లేదంటే విద్యాశాఖ అపవాదులకు గురికావాల్సి వస్తోందని అంటున్నారు. అయితే కొంత మంది ఉపాధ్యాయులు తమకు అణువుగా ఉండే పాఠశాలకు సర్దుబాటులో వెళ్లేందుకు తమకున్న పరిచయాల ఆధారంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో జిల్లా అధికారులకు సిఫార్సు లేఖలు ఇప్పిస్తూ, ఫోన్లు చే యిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈక్రమం లో కొంతమంది ఉపాధ్యాయులు తప్పుడు సమాచారాన్ని జొప్పిస్తున్నట్లు ప్రచారమవుతోంది.

పారదర్శకంగా సర్దుబాటు : కె.సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారి

విద్యార్థులకు సమగ్ర పాఠ్యాంశాల బోధన లక్ష్యంగా ఉపాధ్యాయుల తాత్కాలిక సర్దుబాటు పారదర్శకంగా నిర్వహిస్తాం. సిఫార్సులను పరిగణలోకి తీసుకోం. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ఎలాంటి అపోహలకు గురికావద్దు. ఇందుకోసం పాఠశాలల వారీగా వివరాలు సేకరిస్తున్నాము.

Updated Date - Jul 19 , 2025 | 12:44 AM