ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తెలంగాణ రాష్ట్రం రోల్‌మోడల్‌గా..

ABN, Publish Date - Jun 03 , 2025 | 12:10 AM

తెలంగాణ రాష్ట్రాన్ని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దడ మే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

వేడుకల్లో ప్రసంగిస్తున్న మంత్రి ఉత్తమ్‌

సూర్యాపేటటౌన, జూన 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రాన్ని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దడ మే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా వ వేడుకల్లో భాగంగా కలెక్టరేట్‌లో సోమవారం జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు. సీఎం రేవంతరెడ్డి ఆద్వర్యంలో రాష్ట్ర మంత్రి వ ర్గం రూపొందించిన తెలంగాణ రైజింగ్‌ 2047 విజన డాక్యుమెంట్‌ విశిష్టత ఎంతో గొప్పదన్నా రు. సంక్షేమం, సామాజిక న్యాయం, గ్రీన ఎనర్జీ, ఇన్నోవేషన, ఇండసీ్ట్ర, టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని అన్నా రు. గడిచిన 18నెలల్లో 25,35,964 మందికి రూ.20,617 కోట్ల రుణమాఫీ అమలుచేశామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి న తర్వాత వానాకాలం, యాసంగి పంటల దిగుబడి యావత భారత దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టిందన్నారు. పండించిన పంట ను ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడమే కాకుండా కొనుగోలు చేసిన ధాన్యానికి 24గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాలో నగదు జమచేశామన్నారు. నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ నుంచి ముత్యాల బ్రాంచ కెనాల్‌, జానపహాడ్‌ బ్రాంచ కెనాల్‌తో పాటు పలు ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులకు సంవృద్ధిగా నీరు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీ, గృహజ్యోతి పథకం కింద ఉచితంగా 200యూనిట్ల వరకు ప్రతి కుటుంబానికి విద్యుతను ఉచితంగా అందిస్తున్నామని గుర్తుచేశారు. పేదల కళ్లలో ఆనందం చూసేందుకు అర్హులైన ప్రతి నిరుపేదకు ఆరు కిలోల చొప్పున ఉచితంగా సన్నబియాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.10కోట్ల మందికి, రాష్ట్ర జనాభాలో 84 శాతం మందికి ఉచితంగా నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేయడం చరిత్రాత్మక ఘట్టమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ మూడు నెలలకు కలిపి 18కిలోల బియ్యం, అంత్యోదయ లబ్ధిదారులకు 105 కిలోలు, అన్నపూర్ణ లబ్ధిదారులకు 30కిలోల బియ్యం ఒకేసారి అందిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోందని, అర్హులైనవారు ఇళ్లు నిర్మించేందుకు రూ.5లక్షల ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన పేదలందరికీ తెల్ల రేషనకార్డులు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, మౌలిక సదుపాయాల కల్పనతో నూతనంగా ఆసుపత్రులు, క్రిటికల్‌ కేర్‌ బాక్సులు, నర్సింగ్‌ కళాశాలలు నూ తనంగా నిర్మిస్తున్నామని తెలిపారు. హైదరాబా ద్‌ నగరాన్ని గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకుగ్లోబ ల్‌ సమ్మిట్‌, మిస్‌ వరల్డ్‌, బయోఆసియా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

సాగుకు సమృద్ధికి నీరు

జిల్లాలో 5,85,464 ఎకరాల వ్యవసాయ భూ మి సాగులోకి వచ్చిందని, అందుకు అవసరమై న నీటిని నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ, మూసీ, ఎస్సారెస్పీ సెకండ్‌ఫేజ్‌ నుంచి అందించినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జిల్లాలో ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ, కొత్తఎత్తిపోతల పథకాల నిర్మాణాలు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. జిల్లాలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.755.35 కోట్ల విలువైన 3,25,601లక్షల మెట్రిక్‌ టన్నుల... ధాన్యం కొనుగోలు చేసి రూ.550.54 కోట్ల నగదు ను రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు. సన్నా లు పండించిన రైతులకు ప్రభుత్వం కింటాకు రూ.500 బోనస్‌ కింద 7,128 మంది రైతులకు రూ.25.17కోట్లు చెల్లించామన్నారు. 627 మంది రైతులకు 1,876 ఎకరాల్లో డ్రిప్‌ ఇరిగేషన కోసం రూ.3.58కోట్ల సబ్సిడీని అందించినట్లు తెలిపారు. 1,54,220 లక్షల మంది రైతులకు రూ. 116.42 కోట్ల వ్యయంతో ఉచిత విద్యుత కనెక్షన్లు మంజూరు చేశామన్నారు. అర్హులైన వారందరికీ తెల్లరేషనకార్డుల మంజూరుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జిల్లా ఉంచి అందిన 22,913 దరఖాస్తులకుగాను ఇప్పటివరకు 9,529 దరఖాస్తులకు ఆమోదం లభించిందన్నారు. విద్యారంగంలో రూ.20.40కోట్లతో 571 పాఠశాలలను ఆధునికీకరించినట్లు తెలిపారు. నీటిపారుదల రంగం నుంచి విద్యావ్యవస్థ వరకు ప్రక్షాళన చేసి 2047 నాటికి రాష్ట్రాన్ని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు రూ.23,73,00,000ల విలువైన చెక్కును మెప్మా సిబ్బందికి అందజేశారు. అనంతరం వివిధ శాఖల స్టాల్స్‌ను పరిశీలించారు. ఇటీవల పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌ పవార్‌, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌, ఎస్పీ నర్సింహ, అదనపు కలెక్టర్‌ పీ రాంబాబు, వివిధశాఖల అదికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2025 | 12:11 AM