సుధాబ్యాంకు రుణమేళాను సద్వినియోగం చేసుకోవాలి
ABN, Publish Date - Jul 03 , 2025 | 12:28 AM
సూర్యాపేటఅర్బన, హుజూర్‌నగర్, కోదాడ రూరల్, జూలై 2(ఆంధ్రజ్యోతి): సుధా బ్యాంకు అందిస్తున్న రుణమేళాను సద్వినియోగం చేసుకోవాలని సుధా బ్యాంకు ఎండీ పెద్దిరెడ్డి గణేష్ కోరారు.
సూర్యాపేటఅర్బన, హుజూర్‌నగర్, కోదాడ రూరల్, జూలై 2(ఆంధ్రజ్యోతి): సుధా బ్యాంకు అందిస్తున్న రుణమేళాను సద్వినియోగం చేసుకోవాలని సుధా బ్యాంకు ఎండీ పెద్దిరెడ్డి గణేష్ కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బ్యాంకు ఆవరణలో ఏర్పా టు చేసిన రుణమేళ కార్యక్రమా న్ని ప్రారంబించి మాట్లాడారు. సుదాబ్యాంకు ఆద్వర్యంలో 16 రకాల రుణాలను అందిస్తున్నామన్నారు. సూర్యాపేట జిల్లాకేంద్రం, హుజూర్‌నగర్, కోదాడ పట్టణాల్లో బుధవారం జరిగిన రుణమేళా సమావేశాల్లో ఆయన మాట్లాడారు. సుధాబ్యాం క్ ద్వారా వ్యాపారస్తులు, ప్రజలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరుచేస్తున్నట్లు తెలిపారు. రైస్‌మిల్లర్లు, చిరు వ్యాపారస్తులు, ప్రజలకు అవసరమైన రుణాలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తమ బ్యాంక్ ద్వారా 16 రకాల రుణాలు మంజూరు చేస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏడు బ్రాంచ్‌ల ద్వారా సుమారు రూ.250 కోట్ల టర్నోవర్ చేస్తున్నామన్నారు. మూడు దశాబ్దాలుగా రుణాలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నామన్నారు. ఖాతాదారుల సంక్షేమం కోసం తక్కువ వడ్డీకే అనేక రుణ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమాల్లో బ్యాంక్ మేనేజర్లు పతాని సైదులు, ఇల్లింద్ర సురేష్, చెన్నూరు రవికుమార్, సిబ్బంది బంగారు రమేష్, సందీప్, సైదులు, రామయ్య, లక్ష్మణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - Jul 03 , 2025 | 12:28 AM