ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అన్నదాతలకు తీపి కబురు!

ABN, Publish Date - Jun 16 , 2025 | 12:34 AM

వానాకాలం సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూ ల్‌ రానుండటం, పల్లెలతో ముడిపడి ఉన్న ఎన్నికలు కావడంతో రైతుభరోసాను పూర్తిస్థాయిలో విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

రైతు భరోసాపై చిగురిస్తున్న ఆశలు

సాగు భూమి అంతటికీ పెట్టుబడిసాయం

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రభుత్వం నిర్ణయం

20న పీఎం కిసాన్‌ యోజన సైతం

(ఆంధ్రజ్యోతి,నల్లగొండ): వానాకాలం సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూ ల్‌ రానుండటం, పల్లెలతో ముడిపడి ఉన్న ఎన్నికలు కావడంతో రైతుభరోసాను పూర్తిస్థాయిలో విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈనెల 16న మధ్యాహ్నం క్యాబినెట్‌ మీటింగ్‌తో పాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతులతో సీఎం రేవంత్‌రెడ్డి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఎం నిర్ణయం ప్రకటిస్తారని రైతులంతా ఎదురుచూస్తున్నారు.

స్థానిక సంస్థల్లో భాగమైన జిల్లాపరిషత్‌, మండలపరిషత్‌ పాలకవర్గాల ఎన్నికల అనంతరం గ్రామ పం చాయతీలకు సర్పంచ్‌, పట్టణాలకు మునిసిపల్‌ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో రైతుభరోసా సాయం మంజూరుపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. గత యాసంగిలో కేవలం నాలుగు ఎకరాల వరకే ప్రభుత్వం రైతుభరో సా నగదును రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేసింది. దీంతో మిగతా రైతులంతా నిరుత్సాహం చెందారు. అయితే ఈసారి రైతుభరోసా కోసం పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకొని ఎకరాలతో నిమిత్తం లేకుండా అందరి రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసిన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చర్చ సాగుతోంది.

ఉమ్మడి జిల్లాలో 11.56లక్షలకు పైగా పట్టాదారులు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 21.50లక్షల ఎకరాలకు పైగా సాగు భూమి ఉండగా పట్టాదారులు 11,56,800 మంది వరకు ఉన్నారు. అందులో నల్లగొం డ జిల్లాలో 5,65,788 మంది పట్టాదారులు, యాదాద్రి జిల్లాలో 2,84,250 మంది, సూర్యాపేట జిల్లాలో 3,06,760 మంది పట్టాదారులు ఉన్నారు. వీరందరి బ్యాంకు ఖాతాల్లో రైతుభరోసా నగదు జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సాగుచేసే భూమి అంతటికీ పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. గతంలో ప్రభుత్వం ఏ మేరకు రైతుభరోసా ఇస్తుందనే దానిపై ఓ నిర్ణయానికి రాకపోవడంతో ప్రతీ సీజన్‌లో రైతులు ఆందోళనకు గురయ్యారు. గత ప్రభుత్వం రైతుల పాస్‌బుక్‌లో ఎంత భూమి ఉంటే అంత రైతుబంధు నగదును జమచేసింది. దీంతో గుట్టలు, వెంచర్‌ భూములకు సైతం పెట్టుబడి సాయం అందిందని నాడు కాంగ్రెస్‌ నాయకులు ఆందోళనలు నిర్వహించారు. గతం ప్రభుత్వ హయాంలో ప్రజాధనం వృథా అయిందని భావించిన ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం జిల్లాలో డివిజన్ల వారీగా రైతుభరోసాపై అభిప్రాయ సేకరణ చేసింది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇప్పటికీ ఎన్ని ఎకరాలకు పెట్టుబడి సాయాన్ని చెల్లిస్తారనేదానిపై స్పష్టత లేదు. గత రెండు రోజులుగా మాత్రం సాగు చేసే భూమి మొత్తానికి ఈ వారం రోజుల్లోపై రైతుభరోసా చెల్లిస్తామని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందనే వార్తలు రావడంతో రైతుల్లో ఆశలు పెరిగాయి.

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన ఈ వారంలోనే...

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్‌ సమ్మాన్‌ యోజనకు సంబంధించిన పెట్టుబడి సాయం నగదు ఈ వారంలోనే రైతుల కు అందనుంది. ఈ నెల 20వ తేదీన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన సాయం రైతుల ఖాతాలో జమకానున్నాయి. ప్రతీ రైతు ఖాతాలో రూ.2వేలు జమ చేయనున్నారు. ఇన్‌కంట్యాక్స్‌(ఐటీ) చెల్లిస్తున్న రైతులకు మినహా, ఇతర సన్న, చిన్నకారు రైతులకు ఈ సాయం అందనుంది. కేంద్రప్రభుత్వం అమలు చేసే కిసాన్‌ సమ్మాన్‌ యోజనతో పాటు ఇతర పథకాలు దక్కాలంటే రైతులు ప్రత్యేకంగా ఆధార్‌కార్డు మాదిరిగా భూదార్‌ కార్డు కోసం వ్యవసాయశాఖను సంప్రదించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 5లక్షల మంది వరకు రైతులు ఫార్మర్‌ ఐడీ రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసుకున్నారు. ఈ వారంలోనే పీఎం కిసాన్‌ యో జన రానుండటంతో మిగతా 50శాతం పైగా రైతులు పెద్ద సంఖ్యలో భూదార్‌ కార్డు కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

పెట్టుబడి లేక రైతుల ఇక్కట్లు

ప్రతీ సీజన్‌లో చేతుల్లో పెట్టుబడి నగదు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత బీఆర్‌ఎస్‌ హయాంలో ఎకరాకు రూ.5వేల చొప్పున ఏటా రూ.10వేలు పెట్టుబడి సాయంగా రైతుల బ్యాంక్‌ ఖాతాలో నగదు జమ అయ్యేవి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఎకరాకు రూ.7,500 చెల్లిస్తామని హామీ ఇచ్చినా, అధికారంలోకి వచ్చాక నిధుల కొరత పేరుతో ఎకరాకు రూ.6వేల చొప్పున మొత్తం రూ.12వేలు చెల్లిస్తామని ప్రకటించింది. గత ఏడాది పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం గత మాదిరిగానే ఎంత భూమి ఉన్న అంతా మేరకు రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో రైతుభరోసా నగదు జమచేసింది. ఆ తరువాత మాత్రం రైతుభరోసా విషయంలో ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోయింది. ఈ ఏడాది జనవరి 26న మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 72 మండలాల్లోని 72 గ్రామాల్లో రైతుభరోసాను నూటికి నూరుశాతం అమలు చేశారు. ఆ తరువాత ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా కేవలం నాలుగు ఎకరాల వరకే ప్రభుత్వం రైతుభరోసాను విడుదల చేసింది. పెట్టుబడి సాయం అందకపోవడంతో గత యా సంగిలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో పూర్తిస్థాయిలో రైతుభరోసా అమలు చేసేందుకు ప్ర భుత్వం సన్నాహాలు చేస్తుండంతో రైతులు ఉత్సాహంగా ఉన్నారు.

సాయం కోసం ఎదురుచూపు

పాలకవీడు: పాలకవీడు మండలంలో 18వేల ఎకరాల మాగాణి, 3వేల ఎకరాల మెట్ట భూములు ఉన్నాయి. యాసంగిలో సన్నధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్‌ రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. అయితే ప్రస్తుతం వానాకాలం సాగు పనుల్లో ఉన్న రైతులకు దీంతో కొంత ఊరట కలిగింది. అయితే ప్రభుత్వం రైతుభరోసా అందజేస్తే పెట్టుబడికి ఇబ్బందులు ఉండవని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనికితోడు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని రైతులు కోరుతున్నారు.

అప్పు తెచ్చి వ్యవసాయం చేస్తే వడ్డీలకే సరి : కమాలాకర్‌, రైతు, పాలకవీడు

ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్ల కిరాయిలు, కూలీల ఖర్చులు బాగా పెరిగిపోయాయి. దీంతో సాగు పనులకు ప్రైవేట్‌ వ్యక్తు ల వద్ద అప్పులు తెస్తున్నా. వ్యవసాయం చేస్తే వచ్చే మొత్తం వడ్డీలకే సరిపోతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వానాకాలం సీజన్‌ ఆరంభానికి ముందే బ్యాంకులద్వారా రుణాలు, రైతుభరోసా సహాయం అందించాలి.

Updated Date - Jun 16 , 2025 | 12:34 AM