ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విత్తనాలపై నిఘా

ABN, Publish Date - May 29 , 2025 | 11:49 PM

వానాకాలం సీజన్‌ ప్రారంభమైంది. ఈ ఏడాది ముందస్తుగానే తొలకరి వర్షాలు పలకరించాయి. రైతులు పంటలు సాగుచేసేందుకు ఇప్పటికే దుక్కులు సిద్ధం చేశారు. సాధారణంగా సీజన్‌ ప్రారంభం కాగానే రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువుల బెదడ ఉంటుంది.

జోరుగా విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు

జిల్లాలో నాలుగు తనిఖీ బృందాలు

ఎమ్మార్పీకే విక్రయించాలని వ్యవసాయశాఖ ఆదేశం

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

(ఆంధ్రజ్యోతి,యాదాద్రి) : వానాకాలం సీజన్‌ ప్రారంభమైంది. ఈ ఏడాది ముందస్తుగానే తొలకరి వర్షాలు పలకరించాయి. రైతులు పంటలు సాగుచేసేందుకు ఇప్పటికే దుక్కులు సిద్ధం చేశారు. సాధారణంగా సీజన్‌ ప్రారంభం కాగానే రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువుల బెదడ ఉంటుంది. నాణ్యమైన విత్తనాలంటూ కొంతమంది రైతులను మోసం చేసి విక్రయిస్తారు. తద్వారా రైతు లు నష్టపోయే అవకాశం ఉంది. దీన్ని కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగా చర్యలు ప్రారంభించింది.

జిల్లాలో మొత్తం 17మండలాల్లో వానాకాలంలో 4.40 లక్షల ఎకరాల్లో పలు పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల విక్రయాలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిం ది. రైతులకు అందుబాటులో ఎరువులు ఉంచేందుకు చర్య లు తీసుకుంటోంది. మరోవారం రోజుల్లో ఎరువులు, విత్తనా ల విక్రయాలు ఊపందుకోనున్నాయి. రైతులకు ఎరువులను ఎమ్మార్పీకే విక్రయించేందుకు వ్యవసాయశాఖ చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా ఎరువుల విక్రయాలపై నిఘా ఏర్పాటు చేసింది. ఎరువులు అధిక ధరల కు విక్రయిస్తే డీలర్లపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఎరువుల విక్రయాలను పరిశీలించేందుకు అధికారులు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో నాలుగు తనిఖీ బృందాలను ఏర్పాటుచేశారు. ఈ బృందం లో ఇద్దరు ఏడీఈలు, ఏవోలు, పోలీసు అధికారి, కానిస్టేబు ల్‌ ఉంటారు. జిల్లాలో ఇప్పటికే దాదాపుగా 45 దుకాణాల్లో ఈ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని దుకాణాల్లో నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించకుండా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 229 విత్తన, ఎరువుల డీలర్ల దుకాణాలు ఉన్నాయి. వీటిలో పీఏసీఎస్‌, ఏఆర్‌ఎ్‌సకేతో పాటు ప్రైవేట్‌ డీలర్లు ఉన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టేందుకు బృందాలు జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్వహించడంతోపాటు ఎమ్మార్పీకే రైతులుకు విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నాయి. జిల్లాలో రాష్ట్రస్థాయి తనిఖీ బృందం (స్క్వాడ్‌) కూడా పర్యటించనుంది.

విస్తృతంగా తనిఖీలు

అధికారులు జిల్లాలో జిల్లాస్థాయి, డివిజన్‌, మండలాల స్థాయిలో తనిఖీ బృందాలను ఏర్పాటుచేశారు. ఈ బృందాలు జిల్లాలో ఉన్న ఫర్టిలైజర్‌ దుకాణాలను తనిఖీ చేసి విత్తనాలు, ఎరువుల విక్రయాలను పరిశీలించనున్నాయి. ఈ మేరకు జిల్లాలోని డీలర్ల వద్ద ఉన్న పాత స్టాక్‌ వివరాలను సేకరిస్తున్నారు. డీలర్ల వద్ద ఉన్న పాత స్టాక్‌ను అదే ధరలకు రైతులకు విక్రయించాలని ఆదేశాలు జారీ చేశారు. గత సంవత్సరం డీలర్ల వద్ద మిగిలిపోయిన ఎరువులను పాత ధరలకే విక్రయించాలని, కొత్త ధరలకు విక్రయించవద్దని అధికారులు స్పష్టం చేశారు. ఎరువుల కొనుగోళ్లు, స్టాక్‌, ధరల అంశాలను పరిశీలిస్తామని, కృత్రిమ ఎరువుల కొరతను స్పష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. డీలర్ల వద్ద స్టాక్‌ ఉన్నంత వరకు ఎరువులను రైతులకు విక్రయించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎరువుల లభ్యత విషయంలో ఎలాంటి అపోహలు, ఆందోళనలు చెందవద్దని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.

అందుబాటులో విత్తనాలు, ఎరువులు

వానాకాలంలో సాగుచేసే రైతులకు విత్తనాలు, ఎరువుల ను దుకాణాల్లో రైతులకు అందుబాటులో ఉంచేందుకు వ్య వసాయశాఖ చర్యలు తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో 75,039 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం. ఇప్ప టి వరకు 14,857 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అందుబాటు లో ఉన్నాయి. వీటిలో యూరియా, డీఏపీ. ఎంవోపీ, కాంప్లెక్సులు,తదితర ఎరువులు ఉన్నాయి. యూరియా 9,550 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 1,281, ఎంవోపీ 439, కాంప్లెక్స్‌ ఎరువులు 3,151, ఎస్‌ఎ్‌సపీ 436 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉన్నాయి. వర్షాలు కురియగానే రైతులకు సరిపడా ఎరువులను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో వరి 2.95లక్షల ఎకరాల్లో, పత్తి 1,15000 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందుకోసం 1,28,800 విత్తన ప్యాకెట్లు అవసరం. 2.95లక్షల ఎకరాల్లో వరి సాగుకు 36,138క్వింటాళ్ల విత్తనాలు అందుబాటు లో ఉన్నాయి. మిగతా విత్తనాలకు వ్యవసాయశాఖ అధికారులు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. ప్రస్తు తం డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల వాడకం అధికంగా ఉంటుంది. ఆగస్టులో యూరియాతో పాటు మరికొన్ని కాంప్లెక్స్‌ ఎరువులు వాడకం ఎక్కువ. మార్క్‌ఫెడ్‌లో బఫర్‌స్టాక్‌ 4,000 మెట్రిక్‌టన్నుల యూరియాను ఉంచారు. దీంతో రైతులకు కావల్సిన ఎరువులను దశలవారీగా పంపిణీ చేసేందుకు కార్యచరణ ప్రణాళికను రూపొందించారు. జిల్లాలోని సహకార సంఘాలతోపాటు ఫర్టిలైజర్‌ దుకాణాల్లో యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువులు, పొటాష్‌, ఎన్‌ఓపీ ఎరువులను అందుబాటులో ఉంచనున్నారు. జిల్లాలోని ప్రతీ డీలర్‌ రైతులకు కొనుగోళ్లకు సంబంధించిన బిల్లు తప్పకుండా ఇవ్వాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు

గోపాల్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

వానాకాలం సీజన్‌ ప్రారంభమైంది. రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాం. సీజన్‌లో వివిధ దశల్లో ఎరువులు అందేలా ప్రభుత్వానికి నివేదిక పంపాం. ఎరువులు, విత్తనాల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కల్తీ విత్తనాలు, ఎరువులు విక్రయించిన వారిపై ఎఫ్‌సీవో 85చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. నకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశాం. అన్ని దుకాణాల్లో ఈ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఎరువులు, విత్తనాల కృత్రిమ కొరత సృష్టితే కఠిన చర్యలు తీసుకుంటాం.

29బీఎన్‌జీ2 వ్యవసాయశాఖ అధికారి గోపాల్‌

Updated Date - May 29 , 2025 | 11:49 PM