ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థులు చట్టాల గురించి తెలుసుకోవాలి

ABN, Publish Date - Jul 29 , 2025 | 12:21 AM

విద్యార్థులు చట్టాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలోని లీగల్‌ టీం సభ్యులు కోక సబిత, కానుగంటి శ్రీశైలం, బత్తుల గణేష్‌ అన్నారు.

మోత్కూరు, జూలై 28 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చట్టాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలోని లీగల్‌ టీం సభ్యులు కోక సబిత, కానుగంటి శ్రీశైలం, బత్తుల గణేష్‌ అన్నారు. సోమవారం మోత్కూరు కస్తూర్బా పాఠశాలలో వారు విద్యార్థినులకు విద్యా హక్కుచట్టం, గృహ హింస నిరోధక చట్టంపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే కలిగే అనర్థాలను వివరించారు. పాఠశాలలో వసతులు, భోజనం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకరావాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుజాత, రమ్య, గాంధీలక్ష్మీ, జ్యోతి, శ్రీదేవి, ప్రియాంక, మహేశ్వరి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 29 , 2025 | 12:21 AM