ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఐటీఐల బలోపేతం

ABN, Publish Date - Jul 23 , 2025 | 12:27 AM

ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐ)బలోపేతం పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఒకప్పుడు ఐటీఐల్లో చేరాలంటే పదో తరగతిలో ఉన్నత స్థాయిలో మార్కులు లభిస్తేనే సీట్లు దొరికేవి. రానురాను ఈ కేంద్రాలకు ఆదరణ కరువైంది. ఈ నేపథ్యంలో స్థానిక యువతకు ప్రభుత్వం ఆధునిక పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా బోధించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా కొత్త టెక్నాలజీ పరిచయం చేయనుంది.

స్థానికంగా ఉపాధి కల్పనకు సన్నాహాలు

వృత్తి కోర్సుల్లో చేరేందుకు విద్యార్థుల అనాసక్తి

ట్రేడ్‌లపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన

ప్రతి కోర్సులోనూ 30మందికి పైగా చేరేలా ప్రయత్నాలు

అన్ని ట్రేడ్‌ల్లోనూ సీట్లను భర్తీ చేసేందుకు చర్యలు

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐ)బలోపేతం పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఒకప్పుడు ఐటీఐల్లో చేరాలంటే పదో తరగతిలో ఉన్నత స్థాయిలో మార్కులు లభిస్తేనే సీట్లు దొరికేవి. రానురాను ఈ కేంద్రాలకు ఆదరణ కరువైంది. ఈ నేపథ్యంలో స్థానిక యువతకు ప్రభుత్వం ఆధునిక పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా బోధించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా కొత్త టెక్నాలజీ పరిచయం చేయనుంది.

ఐటీఐలను నియోజకవర్గస్థాయిలో నైపు ణ్య శిక్షణా కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభు త్వం చర్యలు చేపట్టింది. ఐటీఐలను ఆధునిక శిక్షణ కేంద్రాలు(ఏటీసీ)గా మార్చనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కోర్సులతోపాటు మరికొన్ని కేటగిరీల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వం భువనగిరిలోని ఐటీఐ కేంద్రాన్ని రూ.6.50కోట్లతో ఆధునికీకరించింది. త్వరలోనే ఈ భవనం అందుబాటులోకి రానుంది. ఈ కేంద్రంలో ప్రస్తుతం ఉన్న అన్ని కేటగిరీల్లోని కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలన్న లక్ష్యాన్ని నిర్దేశించింది. భువనగిరి ఐటీఐలో వివిధ కోర్సు ల్లో మొత్తం 600సీట్లు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు పలు గ్రేడ్‌ల్లో కేవలం 42సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈనేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐల్లో మెజార్టీ సీట్లను భర్తీ చేసేందుకు జిల్లాయంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈమేరకు ఉపాధికల్పన, విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి, ఐటీఐ ప్రిన్సిపాళ్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. ఫిట్టర్‌, డీజిల్‌ మెకానిక్‌, ఎలక్ర్టికల్‌, ఎలక్ర్టానిక్‌, తదితర గ్రేడ్‌ల్లో సీట్లు భర్తీ చేసేందుకు తీసుకోవల్సిన అవకాశాలపై చర్చించింది. ఇటీవల పదో తరగతి విద్యార్థుల అడ్వాన్స్‌ సప్లమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. చాలామంది విద్యార్థులు ఇంటర్‌ తర్వాత ఇంజినీరింగ్‌ వైపువెళ్తున్నారు. ఈనేపథ్యంలో ముందస్తుగానే ఐటీఐల్లో చేరి, అనంత రం డిప్లామా కోర్సులు చేసుకునే అవకాశం ఉందన్న అంశాలపై విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వివరించేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రధానంగా ఐటీఐ కోర్సుల్లో చేరడం ద్వారా త్వరగా ఉపాధి దొరుకుతుందని విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించనున్నారు. ఈ మేరకు ఆయా శాఖల అధికారులు ప్రభుత్వ ఐటీఐల్లోనూ విద్యార్థులు పలు కోర్సుల్లో చేరేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించింది.

హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో..

హైదరాబాద్‌ నగరానికి జిల్లా సమీపంలోనే ఉండటంతో రానున్న రోజుల్లో పెద్దఎత్తున పరిశ్రలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక యువతకు ప్రస్తుతం ఉన్న పరిశ్రమలతో పాటు నూతనంగా నెలకొల్పే వాటిల్లోనూ ఉద్యోగ అవకాశాలు ఉండేలా పలు కోర్సుల్లో శిక్షణ ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఆధునిక పారిశ్రామిక అవసరాలు, టెక్నాలజీలు, బోధన పద్ధతు లు, కొత్త యంత్రాలకు అనుగుణంగా సమాలోచనలు చేస్తోంది. జిల్లాకు చెందిన గ్రామీణ యువతకు స్వయం ఉపాధికోసం శిక్షణ పొందేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో చాలామంది యువత స్వయం ఉపాధి శిక్షణకు దూరమవుతున్నారు. జిల్లాలో మొత్తం 17 మండలాలు, ఆరు మునిసిపాలిటీలు, 428 గ్రామపంచాయతీలున్నాయి. వివిధ కోర్సుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు శిక్షణ ఇప్పించాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీచేసింది. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, ఒక్కో ట్రేడ్‌లో కనీసం 30 నుంచి 40మంది విద్యార్థులు చేరేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సంబంధిత శాఖలకు జిల్లాయంత్రాంగం ఆదేశాలు జారీచేసింది. వివిధ వృత్తి విద్యా కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించనుండటంతో విద్యార్థుల్లో ఐటీఐల్లో చేరే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో ఏటీసీల్లో ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌ కోర్సులు నిర్వహించాలని యోచిస్తోంది. ఐటీఐ బలోపేతంపై అధికారుల నిర్ణయంతో స్థానిక యువతకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

వృత్తి విద్యా కోర్సులపై అవగాహన : భాస్కర్‌రావు, అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు)

ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థల (ఐటీఐ)ను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఐటీఐల్లో సీట్లను భర్తీ చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాం. ఇప్పటికే విద్యాశాఖతోపాటు ఉపాధి కల్పన, గ్రామీణాభివృద్ధి శాఖలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి, పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వృత్తి విద్యాకోర్సుల్లో చేరేలా అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఐటీఐల్లోని వివిధ కోర్సులపై విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాం.

Updated Date - Jul 23 , 2025 | 12:27 AM