బయోమైనింగ్ దిశగా అడుగులు
ABN, Publish Date - May 17 , 2025 | 12:18 AM
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మునిసిపాలిటీలో చెత్త నుంచి సేంద్రీయ ఎరువుల తయారీకి అడుగులు పడుతు న్నాయి. చెత్తను బయో మైనింగ్ ద్వారా శుద్ధి చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ వ్యర్థాలు వివిధ దశల్లో శుద్ధి అయ్యాక చివరగా వచ్చే బయో ఎర్త్‌ను. జీవ ఎరువుగా వినియోగించేందుకు మునిసిపాలిటీ రంగం సిద్ధం చేస్తోంది. - ( ఆంధ్రజ్యోతి-మిర్యాలగూడ టౌన్)
మిర్యాలగూడలో తీరనున్న డంపింగ్ యార్డు కష్టాలు
చెత్త నుంచి వర్మీం కంపోస్టు ఎరువుల తయారీకి ప్రణాళిక
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మునిసిపాలిటీలో చెత్త నుంచి సేంద్రీయ ఎరువుల తయారీకి అడుగులు పడుతు న్నాయి. చెత్తను బయో మైనింగ్ ద్వారా శుద్ధి చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ వ్యర్థాలు వివిధ దశల్లో శుద్ధి అయ్యాక చివరగా వచ్చే బయో ఎర్త్‌ను. జీవ ఎరువుగా వినియోగించేందుకు మునిసిపాలిటీ రంగం సిద్ధం చేస్తోంది.
- ( ఆంధ్రజ్యోతి-మిర్యాలగూడ టౌన్)
వ్యాపార, వాణిజ్య, వైద్య, విద్యారంగాల్లో అగ్రగామిగా అభివృద్ధి చెందుతోన్న మిర్యాలగూ డ మునిసిపాలిటీ పరిధిలో జనాభా రోజురోజు కూ పెరుగుతోంది. పట్టణంలో ఆవాసాల సంఖ్య 22,600లు ఉండగా కొత్త నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. ఇక పట్టణ సమీపంలోని దామరచర్లలో 4వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రంలో ఇప్పటికే ఉత్పత్తి మొదలు కాగా ఆ ఎఫెక్టుతో పట్టణ జనాభా పెరగనుందని అంచనాలున్నాయి.
నిత్యం 50 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు
మిర్యాలగూడ పట్టణంలోని ఇళ్లు, వ్యాపార కేంద్రాల నుంచి నిత్యం 50 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఆయా వ్యర్థ్ధాలను డంప్ చేసేందుకు రెండు దశాబ్దాల క్రితం ఈ దులగూడలో ఆరున్నర ఎకరాల స్థలంలో యా ర్డు ఏర్పాటు చేశారు పురపాలకులు. అయి తే పట్టణంలో పెద్దమొత్తంలో వెలువడుతున్న వ్యర్థ్ధాలను డంప్ చేసేందుకు ఆ స్థలం సరిపోకపోవడంతో సమస్యగా మారింది.ఈ నేపఽథ్యంలో అధికారులు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు
స్థానికుల నుంచి అభ్యంతరాలు
స్థల సమస్య అలా ఉండగా డంపింగ్ యార్డు నుంచి వెలువడే దుర్ఘంధం, పొగ కారణంగా ఈ దులగూడ, రాంనగర్ బంధం, గూడూరు కాలనీల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. యార్డులో గుట్టలుగా ఉన్న వ్యర్థాలకు నిప్పు పెడుతుండడంతో వెలువడుతున్న పొగ చుట్టుపక్కల కాలనీ వాసులను ఇబ్బందికి గురి చేస్తోంది. డంపింగ్ యార్డును మార్చాలంటూ ఆయా కాలనీల ప్రజలు పలుమార్లు ము నిసిపల్ అధికారులకు వినతిపత్రాలు అందించడంతో పాటు ఖమ్మం రహదారిపై రాస్తారోకో నిర్వహించిన సందర్భాలున్నాయి.
బయోమైనింగ్ అమలుకు చర్యలు
పట్టణంలోని డంపింగ్ యార్డును ఇటీవల కలెక్టర్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ జేడీ వేర్వేరు గా పరిశీలించి పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించారు. ఈ నేపధ్యంలో డంపింగ్ యార్డులో బయోమైనింగ్ విధానం అమలు చేస్తే పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భావించిన అఽధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. వీలైనంత త్వరగా బయోమైనింగ్ విధానం అమలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఉపయోగలివే..
పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి సేక రించిన చెత్తను నాలుగు దశలుగా విభజించి శుద్ధి చేస్తారు. చివరి అవుట్‌పుట్ 8 ఎంఎం కన్నా తక్కువగా ఉంటుంది. దీనిని బయోఎర్త్ అంటారు. పంట పొలాల్లో ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. ఆధునిక పద్ధతిలో డంపింగ్ యార్డు నిర్వహణనే బయోమైనింగ్ విధానమంటారు. ఈ విధానంలో వ్యర్ధపదార్థ్ధాల నుంచి విలువైన లోహాలన ు సేకరించేందుకు సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియను రాష్ట్రంలోని పలు మునిసిపాలిటీల్లో ఇప్పటికే అమ లు చేస్తున్నారు. ఆధునికమైన ఈ పద్ధతితో పర్యావరణానికి ఎలాంటి హాని కలగకపోగా దుమ్ము, ఽధూళి, పొగ వెలువడటం లాంటి ఇబ్బంది ఉండదు. ఇక సెగ్రిగేషన్ చేసే పనులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించినట్లు మునిసిపల్ అధికారులు తెలిపారు. తడి, పొడి చెత్తను వేరు చేసి తడి చెత్త నుంచి వర్మీ కంపోస్టును తయారు చేయనున్నారు.
అతి త్వరలో బయోమైనింగ్ విధానం అమలు
డంపింగ్ యార్డులో అతిత్వరలో బయోమైనింగ్ విధానం అమలు కానుంది. ఆ విధానం అమలు చేసే ఏజెన్సీలతో కలెక్టర్, మునిసిపల్ జేడీ మాట్లాడారు. రెండు మూడు మునిసిపాలిటీలలో గుర్తించి ఏజెన్సీ సంస్థకు అప్పగించాల్సి ఉం టుంది. ఆధునిక విధానం అమలు జరిగితే నిర్వహణ సమస్యనేది ఉండదు. అ యితే ప్రస్తుతం యార్డులో ఉన్న వ్యర్థ్ధాలను తొలగించి స్థలాన్ని చదును చేసి బయోమైనింగ్ చేసే సంస్ధకు అప్పగించాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.
- మహ్మద్ యూసుఫ్, మునిసిపల్ కమిషనర్, మిర్యాలగూడ
Updated Date - May 17 , 2025 | 12:18 AM