ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కన్నుల పండువగా శ్రీ వేంకటగిరి లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం

ABN, Publish Date - May 13 , 2025 | 12:23 AM

మండలంలోని వెంకటాపురం గ్రామ శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ప్రసిద్ధ క్షేత్రాలైన యాదగిరిగుట్ట, పాత గుట్ట ఈ రెండు దేవస్థానాలకు మూలంగా వెంకటాపురం లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రాన్ని భక్తులు భావిస్తుంటారు.

తుర్కపల్లి, మే 12 (ఆంరఽధజ్యోతి):మండలంలోని వెంకటాపురం గ్రామ శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ప్రసిద్ధ క్షేత్రాలైన యాదగిరిగుట్ట, పాత గుట్ట ఈ రెండు దేవస్థానాలకు మూలంగా వెంకటాపురం లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రాన్ని భక్తులు భావిస్తుంటారు. అందంగా తీర్చిదిద్దిన మండపంలో సంప్రదాయ పద్ధతిలో కల్యాణ వేడుక నిర్వహించారు. యాదగిరిగుట్ట దేవస్థానం నుంచి అనువంశిక ధర్మకర్త భాస్కరాయుణి నర్సింహమూర్తి స్వామి. అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, పూలహారాలు అందించారు. వెంకటాపురం ఆలయ వంశపారంపర్య పూజారి రమాకాంత్‌శర్మ ఆధ్వర్యంలో కల్యాణతంతు జరిగింది. సాయంత్రం స్వామివారిని రథంపై ఊరేగించారు. కల్యాణోత్సవంలో డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ కల్లూరి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

ప్రముఖులకు సన్మానం : కల్యాణోత్సవానికి పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు. ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న, రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్‌ అయోధ్యరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్‌, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సూదగాని హరిశంకర్‌గౌడ్‌, మదర్‌ డెయిరీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు బోరెడ్డి రాంరెడ్డి, బబ్బూరి రవీంద్రనాథ్‌గౌడ్‌లను నిర్వాహకులు సన్మానించారు. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ధనావతు శంకర్‌నాయక్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షు డు పిన్నెపురెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2025 | 12:23 AM