ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హైదరాబాద్‌ నుంచి సాగర్‌కు ప్రత్యేక బస్సు

ABN, Publish Date - Apr 19 , 2025 | 12:03 AM

ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌కు పర్యాటకుల సౌకర్యార్థం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు పర్యాటక శాఖ గుర్తింపు పొందిన ప్రతిమ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ఎండీ కిశోర్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రతి నెలా మూడవ ఆదివారం ఏర్పాటు

టికెట్‌ ధర రూ.1000

నాగార్జునసాగర్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి) : ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌కు పర్యాటకుల సౌకర్యార్థం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు పర్యాటక శాఖ గుర్తింపు పొందిన ప్రతిమ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ఎండీ కిశోర్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నెలా మూడవ ఆదివారం ఈ సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లోని సంగీత ఎక్స్‌ రోడ్డుకు ఉదయం 6 గంటలకు, ఉప్పల్‌ ఎక్స్‌ రోడ్డుకు ఉదయం 6:20 గంటలకు, ఎల్‌బీనగర్‌కు ఉదయం 6:35 గంటలకు, సాగర్‌ రింగ్‌ రోడ్డుకు ఉదయం 6:45 గంటలకు, అక్కడి నుంచి సాగర్‌కు ఉదయం 9 గంటలకు చేరుకుంటుందని ఆయన తెలిపారు. సాగర్‌లో బుద్ధవనం, జలాశయం మధ్యలోని నాగార్జునకొండలను పర్యాటకులకు చూపిన అనంతరం రాత్రి 10 గంటల వరకు హైదరాబాద్‌కు బస్సు చేరుకుంటుందని పేర్కొన్నారు. పర్యాటకుల సంఖ్యను బట్టి 22, 40సీట్ల బస్సులను నడుపుతామని, ఇందుకు టికెట్‌ ధరను రూ.1000గా నిర్ణయించినట్లు వివరించారు. ఈ ప్యాకేజీలో రవాణాతో పాటు బుద్ధవనం, నాగార్జునకొండకు బోటింగ్‌ టికెట్లతో పాటు మ్యూజియం టికెట్లు ఉంటాయని ఎండీ తెలిపారు. టిఫిన, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఖర్చులు ఎవరికి వారు భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రముఖ దర్శనీయ స్థలాలు, పురాతన బౌద్ధ క్షేత్రాలను దర్శించడానికి ఇది ఒక్క మంచి అవకాశమని, పర్యాటకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 12:03 AM