ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సూపర్‌ఫా్‌స్టగా మారిన శబరి ఎక్స్‌ప్రెస్‌

ABN, Publish Date - Jul 26 , 2025 | 12:18 AM

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న భారతీయ రైల్వే ఇప్పటికే స్టేషన్లను అమృత భారత స్టేషన్లుగా ఆధునీకరిస్తోంది.

మిర్యాలగూడ టౌన, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న భారతీయ రైల్వే ఇప్పటికే స్టేషన్లను అమృత భారత స్టేషన్లుగా ఆధునీకరిస్తోంది. అంతేగాక ప్రయాణికులకు సౌకర్యం, వేగవంతమైన సేవలందించేందుకు అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తోంది. కొత్త ఆలోచనలతో, సరికొత్త ప్రయోగాలతో సాగుతున్న సౌత సెంట్రల్‌ రైల్వే శబరీ ఎక్స్‌ప్రె్‌సను సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రె్‌సగా అప్‌గ్రేడ్‌ చేసింది. 38 ఏళ్లుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ రాజధాని నుంచి కేరళ రాజఽధానికి పరుగులు పెట్టే శబరి ఎక్స్‌ప్రె్‌సలో ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి మీదుగా ప్రయాణిస్తుంది.

ఆర్థిక సంవత్సర ముగింపు నాటికి

సికింద్రాబాద్‌ నుంచి కేరళలోని తిరువనంతపురం వరకూ నడిచే శబరి ఎక్స్‌ప్రెస్‌ సెప్టెంబరు 29 నుంచి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రె్‌సగా పరుగులెట్టనుంది.ఈ మేరకు రైల్వే బోర్డు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కేంద్రమైన నల్లగొండ, మిర్యాలగూడ మీదుగా ఆంధ్రప్రదేశ, తమిళనాడు రాష్ట్రాలను తాకుతూ కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం చేరుకుంటుంది.

మారనున్న ట్రైన నెంబర్లు

ఎక్స్‌ప్రెస్‌ నుంచి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రె్‌సగా అప్‌గ్రేడ్‌ అయిన శబరి ఎక్స్‌ప్రెస్‌ రైలు నెంబర్లు మారనున్నట్లు అధికారులు తెలిపారు. శబఇ ఎక్స్‌ప్రెస్‌ బండి పాత నెంబరు 17229/17230గా ఉండగా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రె్‌సగా మారిన పిదప సదరు రైలు నెంబరు 20629/ 20630గా మార్పుచేశారు. అధికారులు. ఎక్స్‌ప్రెస్‌ నుంచి సూపర్‌ఫా్‌స్టగా అప్‌గ్రేడ్‌ అయిన తరుణంలో రాకపోకల సమయాల్లో కాస్త మార్పు ఉండొచ్చని, రైలు ప్రయాణించే రూట్లలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదని రైల్వే అధికారులు తెలిపారు.

Updated Date - Jul 26 , 2025 | 12:18 AM