ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతుభరోసా రూ.1,318కోట్లు

ABN, Publish Date - Jun 24 , 2025 | 12:25 AM

ఉమ్మడి జిల్లాలో రైతుభరోసా నగదు వేగవంతంగా రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ అవుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు రూ.1,318కోట్లు రైతుభరోసా నగదు రైతులకు అందింది.

రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమ

నేడు రైతులతో సీఎం రేవంత్‌రెడ్డి ముఖాముఖి

నల్లగొండ, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో రైతుభరోసా నగదు వేగవంతంగా రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ అవుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు రూ.1,318కోట్లు రైతుభరోసా నగదు రైతులకు అందింది.

సాగు పెట్టుబడి సాయంగా ఈ నెల 16న ప్రారంభమైన రైతుభరోసా నగ దు జమ మంగళవారం సాయంత్రంతో పూర్తయ్యే అవకాశం ఉంది. వానాకా లం సీజన్‌లో వ్యవసాయ పనుల ప్రారంభానికి ముందే ప్రభుత్వం నగదును జమ చేసింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో 2,27,809 మంది రైతులకు వారి బ్యాంక్‌ ఖాతాల్లో రూ.289,39,70,60 జమయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 2,91,292 మంది రైతులు ఉండగా, ఇప్పటి వరకు 2,80,340 మంది రైతుల ఖాతాల్లో రూ.350.56కోట్ల నగదు జమైంది నల్లగొండ జిల్లాలో మొత్తం 5,65,803 మంది రైతులు ఉండగా రూ.738,67,60,000 రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. కాగా, ఇప్పటివరకు 5,12,894 మంది రైతుల ఖాతాల్లో రూ.678,25,81,000 జమయ్యాయి. మరో రూ.60కోట్ల నగదు పంపిణీ కావాల్సి ఉంది. మంగళవారం సాయంత్రం వరకు ఈ మొత్తాన్ని జమచేసే అవకాశం ఉంది.

నేడు సీఎం రేవంత్‌రెడ్డి వీడియోకాన్ఫరెన్స్‌

ఈ నెల 16న సీఎం రేవంత్‌రెడ్డి రైతువేదికల ద్వారా వీడియోకాన్ఫరెన్స్‌లో రైతులతో మాట్లాడారు. అదేరోజు రైతుభరోసా నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే రైతుల బ్యాంక్‌ఖాతాల్లో నగదు జమ ప్రారంభమైంది. మంగళవారం నాటికి జమ చేయడం పూర్తికానుండటంతో సాయంత్రం 3 నుంచి 5గంటల వరకు రైతులతో సీఎం రేవంత్‌రెడ్డి ముఖాముఖి మాట్లాడనున్నారు. ఇటీవల వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా చింతపల్లి రైతులతో సీఎం రేవంత్‌రెడ్డి ముఖాముఖి మాట్లాడి ప్రభుత్వం నుంచి రైతులకు అందుతున్న సంక్షేమపథకాలతో పాటు రుణమాఫీపై మాట్లాడారు. మంగళవారం నల్లగొండ జిల్లాలోని 90 రైతువేదికల్లో ఏర్పాటుచేసిన వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం రైతులతో మాట్లాడే అవకాశం ఉంది. దీంతో అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ సందర్భంగా జేడీఏ శ్రవణ్‌కుమార్‌ మాట్లాడుతూ, జిల్లాకు అత్యధికంగా రైతుభరోసా నిధులు విడుదలయ్యాయని, నల్లగొండ మండలం వెలుగుపల్లి నుంచి వీడియోకాన్ఫరెన్స్‌కు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి హాజరవుతున్నారని, రైతులు పెద్దసంఖ్యలో రావాలని కోరారు.

Updated Date - Jun 24 , 2025 | 12:25 AM