అర్హులైన రైతులందరికీ రైతు భరోసా
ABN, Publish Date - Jun 17 , 2025 | 12:34 AM
పంటలు సాగుచేసే అర్హులైన ప్రతీ రైతుకు ఎకరాలతో సంబంధం లేకుండా రైతుభరోసా జమవుతుందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తెలిపారు.
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట రూరల్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): పంటలు సాగుచేసే అర్హులైన ప్రతీ రైతుకు ఎకరాలతో సంబంధం లేకుండా రైతుభరోసా జమవుతుందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తు మ్మల నాగేశ్వర్‌రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘రైతునేస్తం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వంగపల్లి రైతు వేదికలో ప్రభు త్వ విప్ అయిలయ్య కలెక్టర్ హనుమంతరావు తో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్‌రెడ్డి దేశంలో ఎక్క డా లేనివిధంగా 25లక్షల మంది రైతులకు రూ.21వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. రైతులకు అండగా నిలవాలనే ఆకాంక్షతోనే రైతుబీమా, రైతుభరో సా, సన్న ధాన్యానికి రూ.500 సబ్సిడీ, ఆధునా త పనిముట్లు అందజేస్తోందన్నారు. గతంలో వరి సాగుచేస్తే ఉరే అంటూ మాజీ సీఎం కేసీఆర్ రైతులను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు సాగుచేసిన ప్రతీ గింజను కొనుగోలు చేసిందని, వాటి తో రాష్ట్ర వ్యాప్తంగా పేదల కడుపునింపుతోందన్నారు. గత ప్రభుత్వం ఆలేరును ఎడారిగా మార్చించిందని, తాము గంధమల్ల ప్రాజెక్టును పూర్తిచేస్తామని, గోదావరి జలాలతో నియోజకవర్గంలో ఉన్న 122 చెరువులను నింపి ఆలేరు ను పసిడి పంటలతో సస్యశ్యామలం చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికా రి గోపాల్, డీఆర్డీఏ నాగిరెడ్డి, ఏడీఏ శాంతినిర్మ ల, మండల ప్రత్యేక అధికారి శోభారాణి, నాయకులు గొట్టం ఉపేందర్‌రెడ్డి, కానుగు బాలరాజ్‌గౌడ్, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, గుండ్లపల్లి భరత్‌గౌడ్, ఎరుకల హేమేందర్‌గౌడ్, ఎంఏవో సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.
‘ప్రజావాణి’ అర్జీలకు సత్వర పరిష్కారం : కలెక్టర్
భువనగిరి (కలెక్టరేట్): ‘ప్రజావాణి’లో ప్రజ లు ఇచ్చిన అర్జీలు పెండింగ్‌లో లేకుండా సత్వ ర పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆయన మాట్లాడా రు. మొత్తం 59 దరఖాస్తులు రాగా, అందులో అత్యధికంగా రెవెన్యూశాఖకు చెందినవి 37 వర కు ఉన్నాయన్నారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలన్నా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జీ.వీరారెడ్డి, ఏ.భాస్కరరావు, జడ్పీ సీఈవో ఎన్.శోభారాణి, గ్రామీణాభివృద్ధిశాఖ జిల్లా అధికారి టీ.నాగిరెడ్డి, ఏవో జగన్మోహనప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులైనా మలేరియా, డెంగీ, చికున్‌గున్యా ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. పారిశుధ్యం పనుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల తరగతి గదులను ప్రతీ రోజు శుభ్రంచేసి పిచ్చి మొక్కలు, గడ్డి లేకుండా చూడాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Updated Date - Jun 17 , 2025 | 12:34 AM