ఆరు నెలల్లో రూ.6 కోట్లు
ABN, Publish Date - Jul 08 , 2025 | 12:33 AM
సైబర్ నేరాలు జిల్లాలో ఇటీవల పెరిగాయి. అమాయకులను లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడుతున్నారు. ఇటీవల డిజిటల్ అరెస్ట్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
జిల్లాలో సైబర్ చోరీలు 40
అధికారికంగా పోయినవి రూ.2.40 కోట్లు
అనధికారికంగా రూ.6 కోట్లు 8 కోదాడ, హుజూర్‌నగర్, గరిడేపల్లిలో ఎక్కువగా బాధితులు
సైబర్ నేరాలు జిల్లాలో ఇటీవల పెరిగాయి. అమాయకులను లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడుతున్నారు. ఇటీవల డిజిటల్ అరెస్ట్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పోలీసులు నిరంతరం అవగాహన కల్పిస్తున్నా ఈ చోరీలు ఆగడం లేదు. ఈ ఏడాది సుమారు 40 కేసులు నమోదైనట్లు సమాచారం. ఆయా కేసులకు సంబంధించి రూ.2.4 కోట్ల వరకు డబ్బులు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. వీరే కాక చాలామంది పోలీసులకు చెప్పుకోలేకపోతున్నారు. అనధికారికంగా రూ.6 కోట్ల వరకు ఉంటాయని సమాచారం.
- (ఆంధ్రజ్యోతి-సూర్యాపేట)
కష్టపడకుండానే డబ్బులు సంపాదించాలనే కొందరు ఆరాటంతో అత్యాశకు పోయి ఉన్న డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సైబర్ బాధితు ల్లో ఎక్కువమంది చదువుకున్న వారు ఉండడం గమనార్హం. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని మోసగాళ్లు నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. కొద్దిమొత్తం పెట్టు బడి పెడితే డబుల్ అవుతాయని నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి వాటిని బాధితుల వాట్సాప్ నెంబర్లరే లింక్ చేస్తున్నారు. సైబర్ నేరాల్లో డిజిటల్ అరెస్టు, బ్యాంక్ రివార్డ్స్ ఏపీకే మోసం, బెట్టింగ్ యాప్ మోసం, జాబ్ ప్రాడ్, స్టాక్ పెట్టుబడి మోసాలు వంటివి అనేకం ఉన్నాయి. బాధితుల డేటా తీసుకొని వారి వాట్సాప్ నెంబర్‌కు లింక్ క్రియేట్ చేస్తారు. బాధితులు లింక్ ఓపెన చేయగానే టెలిగ్రూ్‌పలోకి వెళ్లిపోతారు. నకిలి వెబ్‌సైట్ సృష్టించిన వారే అందులో 1000 నెంబర్ల దాకా వారికే చెందిన వారే ఉండేలా చూసుకుంటారు. అనంతరం లింక్ అయిన వారికి యూట్యూబ్‌లో పెట్టిన వీడియోలకు లైక్‌లు, కామెంట్ చేస్తే డబ్బులు వస్తాయని సమాచారమిస్తారు. ముందు రూ.1000 పంపిస్తే రూ.2వేలు ఇస్తామని నమ్మబలికేలా ఉంటాయి. ఇవి చూసుకొని ఆశ పడ్డ వారు మొదట రూ.1000 పంపిస్తారు. వెంటనే వారికి రూ.2 వేలు పంపిస్తారు. దీంతో బాధితులకు భరోసా లభిస్తుంది. ఫస్ట్ లెవల్ అయిపోగానే రెండవ లెవల్‌లో రూ.5 వేలు జమ చేస్తే రూ.10 వేలు వస్తాయని ఆశ పెడుతారు. యూట్యూట్ కామెంట్స్ కాక కొన్నిగేమ్స్‌ను కూడా క్రియేట్ చేస్తారు. ఆ గేమ్స్ కరెక్ట్‌గా ఆడితే అకౌంట్‌లో డబ్బులు పడతాయని నమ్మిస్తారు. ఆ గేమ్స్ కూడా చిన్నపిల్లలు ఆడే గేమ్స్‌లాగా ఉంటాయి. ఆ గేమ్స్‌ను ఈజీగా ఆడవచ్చు. మళ్లీ రూ.10 వేలు పెట్టినప్పుడు రూ. 5 వేలు వారి అకౌంట్‌లో జమచేస్తారు. ఎలాగో డబ్బులు వస్తున్నాయని ఆశపడి రూ.లక్షలు పెట్టుబడి పెడుతారు. ఒక దశ దాటిన తర్వాత వారి నెంబర్లన్నీ డిలీట్ చేస్తారు. ప్రైవేట్ ఉద్యోగులు, చిన్న ఉద్యోగులు, చిన్న వ్యాపారులు చేసే వారు పెద్ద మొత్తంలో పోగొట్టుకుంటారు.
ఈ ఏడాదిలో 40 కేసులు ..
జిల్లాలో కోదాడ, హుజూర్‌నగర్, గరిడేపల్లి, సూర్యాపేట పట్టణల్లో ఎంతోమంది స్మార్ట్‌ఫోనను ఉపయోగించి నకిలి వెబ్‌సైట్‌కు లింక్ అయి డబ్బులు పోగొట్టుకున్నారు. సుమారు 40 మంది బాధితులు సైబర్ పోలీసులకు ఆనలైనలో ఫిర్యా దు చేశారు. వీరి నుంచి సైబర్ నేరాళ్లు రూ. 2.40 కోట్లు కొట్టేశారు. సకాలంలో ఫిర్యాదు చేస్తే బాధితుల అకౌంట్ల నుంచి డ్రా కాకుండా పోలీసులు అకౌంట్లను నిలిపివేస్తారు. ఆలస్యమైతే సైబర్ నేరగాళ్లు వేరే రాష్ట్రాల నుంచి ఆనలైనలో డ్రా చేసి తప్పించుకొని తిరుగుతుంటారు.
డిజిటల్ అరెస్టు
పోలీసు డ్రస్సులు వేసుకొని అపరిచితులకు వీడియో కాల్ చేస్తారు. మీ మొబైల్ నెంబర్ మీద రూ.3కోట్ల హవాలా నడిచింది. మీరు రూ.30లక్షలు తీసుకున్నారు ఈకేసులో నుంచి బయటపడాలంటే... ఎంతోకొంత ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఇచ్చిన డబ్బులను మళ్లీ తిరి గి రెండు రోజుల్లో ఇస్తామని నమ్మబలుకుతారు. వాళ్లను కనీసం రూమ్‌లో నుంచి కదలనీయకుండా కట్టడి చేస్తారు. మాయమాటలతో బెదిరిస్తారు. ఇలాగే కూడా అనేకమంది మోసపోతున్నారు. పారిశ్రామికవేత్తలను ఎంచుకొని బెదిరిస్తారు. అనుకున్న మేరకు డబ్బులు లాగుతారు. అంతేకాక విదేశాల్లో ఉన్న మీ కుమారులు రేప్, ఇతర కేసుల్లో చిక్కుకున్నారని వారిని బయటికి తీసుకురావాలంటే కొంత సొమ్ము చెల్లించాలని భయబ్రాంతులకు గురి చేస్తూ డబ్బులు వారి అకౌంట్లలో వేయిస్తున్నారు.
లోన యాప్ మోసాలు
ఎటువంటి గ్యారెంటీ లేకుండా రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు లోన ఇస్తామని ఫేస్‌బుక్‌ల్లో ఆప్‌లోడ్ చేస్తున్నారు. కాంటాక్ట్ నెంబర్లను కూడా పొందుపరుస్తారు. ఆ నెంబర్లకు ఫోనచేస్తే కొన్ని లోన ఇచ్చే ఫైనాన్సర్లకు జీఎస్టీ కింద ఆ రుణం నగదును బట్టి కనీసం రూ.5వేల నుంచి రూ.10వేలు చెల్లించాలని నమ్మిస్తారు. రూ.5వేలు చెల్లించిన తర్వాత ఆ ఫోన్లు పనిచేయవు. కొన్ని ఫైనాన్స కంపెనీలు మాత్రం నిజాయితీగానే రుణాలు ఇస్తున్నాయి. ఎక్కువగా మోసం చేస్తున్న కంపెనీలో ఉన్నాయి. వీటిపై కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. 15 రోజుల క్రితం అర్వపల్లి మండల కేంద్రానికి చెందిన వంగాల సుకుమార్‌రాజా(22) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆనలైనలో రుణం తీసుకొని చెల్లించలేక ఫైన్స ఒత్తిడి తట్టులేక ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్‌లు, నకిలీ వెబ్‌సైట్‌లతో లింక్ అయిన వారు పెద్దమొత్తంలో నష్టపోతున్నారు. వీటిపై ఎప్పటికప్పుడు పోలీసులు సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. అయినా సైబర్ నేరాలు తగ్గుముఖం పట్టడం లేదు. జిల్లా వ్యాప్తంగా అనధికారికంగా రూ.6 కోట్ల వరకు డబ్బులు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది.
డబ్బులు కష్టపడితేనే వస్తాయి
డబ్బులు కష్టపడితేనే వస్తాయి. అనవసరంగా నకిలీ వెబ్‌సైట్లను ఓపెన చేసి నష్టపోవొద్దు. అలాగే ఎవరైనా బ్యాంక్‌ల నుంచి మాట్లాడుతున్నామని అకౌంట్ నెంబర్ అడిగితే ఇవ్వవద్దు. వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంచుకోవాలి. లేకుంటే మోసపోతారు. ఎవరైనా మోసపోతే వెంటనే ఆనలైనలో సైబర్‌క్రైం.గౌట్.ఇనకు ఫిర్యాదు చేయాలి.
కొత్తపల్లి నర్సింహ, ఎస్పీ
Updated Date - Jul 08 , 2025 | 12:33 AM