ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘రియల్‌’ కష్టాలు

ABN, Publish Date - May 15 , 2025 | 12:43 AM

సూర్యాపేట జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం దారుణంగా పడిపోయింది. ఎప్పుడు ఊపందుకుంటుందో తెలియని పరిస్థితి. జిల్లావ్యాప్తంగా పెద్దసంఖ్యలో రియల్‌ ఎసే ్టట్‌ ఏజెంట్లు ఉన్నారు. వీరంతా కమీషన్‌తోనే తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు.

తగ్గిన క్రయ విక్రయాలతో ఏజెంట్ల అవస్థలు

జిల్లా కేంద్రంలోనే 300 మందికి పైగా

సగానికి పైగా రిజిస్ట్రేషన్లు

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట): సూర్యాపేట జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం దారుణంగా పడిపోయింది. ఎప్పుడు ఊపందుకుంటుందో తెలియని పరిస్థితి. జిల్లావ్యాప్తంగా పెద్దసంఖ్యలో రియల్‌ ఎసే ్టట్‌ ఏజెంట్లు ఉన్నారు. వీరంతా కమీషన్‌తోనే తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. కేవలం పట్టణాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లో సైతం భూమి విక్రయించే వారికి, కొనుగోలు దారులకు మధ్యవర్తులుగా ఉం టూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఐదారు నెలల నుంచి వ్యాపారం సాగకపోవడంతో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఇతర ఉద్యోగా లు చేయలేక ఖాళీగా ఉండడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి.

సూర్యాపేట జిల్లాలో కోదాడ, హుజూర్‌నగర్‌, తిరుమలగిరి, నేరేడుచర్లలో రియల్‌ వ్యాపారం కొనసాగుతోంది. అన్నిచోట్ల మందకొడిగా కొనసాగుతుండడంతో ఎక్కువ మందికి ఉపాధి కరువైంది. హైడ్రా హైదరాబాద్‌లో అమలుకావడంతో ఆ ప్రభావం జిల్లావ్యాప్తంగా పడింది. ప్రధానంగా చెరువు కింద భూములు కొనేందుకు జంకుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎ్‌సకు అవకాశం ఇచ్చినప్పటికీ కేవలం 30 నుంచి 40 శాతం మంది ఉపయోగించుకున్నారు. అనేక కారణాలతో రియల్‌ ఎస్టేట్‌ పడిపోయింది. ఽభూముల ధరలు మాత్రం తగ్గలేదు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు మాత్రం భూముల ధరలు తగ్గించి విక్రయిస్తున్నారు.

పెరిగిన ధరలు

సూర్యాపేట మునిసిపాలిటీలో సూ ర్యాపేట మండలం రాయినిగూడెం, పిల్లలమర్రి, గాంధీనగర్‌, కుసుమవారిగూడెం, దాసాయిగూడెం, చివ్వెంల మండలంలోని కుడకుడ, దురాజ్‌పల్లి, ఖా శీంపేట, బీబీగూడెం గ్రామాలు విలీనమయ్యాయి. అయితే పెరిగిన ధరలతో ఎక్కడా కూడా సామాన్యు లు భూములు కొనుగోలు చేయలేకపోతున్నారు. సూర్యాపేట సమీపంలో ఐదు కిలోమీటర్ల లోపు ఎక రం భూమి రూ.2 కోట్ల దాకా ధర పలుకుతుండడం తో రియల్టర్లు కూడా ఆసక్తి చూపడంలేదు. ఎకరం స్థలంలో వెంచర్‌ చేయాలంటే కనీసం 1,200 చదర పు గజాలు రోడ్ల కోసం వదిలిపెట్టాలి. అంతేకాక భూమిలో 10శాతం మునిసిపాలిటీ పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయాలి. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలంటే భూమి ధరలో 10 శా తం రెవెన్యూ శాఖకు నాలా పన్నుల రూపంలో చెల్లించాలి. ఇవన్నీ అనుమతులు తీసుకున్న తర్వాత వెంచర్లు చేయాల్సి ఉంటుంది. అయితే భూమి య జమానులు అధిక ధరలు చెబుతుండడంతో వెంచ ర్లు చేసే వారు కూడా ముందుకు రావడంలేదు.

వ్యాపారం అంతంతే...

సూర్యాపేట జిల్లా కేంద్రం అయినప్పటికీ రియల్‌ ఎస్టేట్‌ ఊపందుకోలేదు. సూర్యాపేట పట్టణ జనాభా లక్షా 50వేలు దాటింది. సూర్యాపేట మునిసిపాలిటీలో పలు గ్రామాలు విలీనమయ్యాయి. అయితే కనీసం 200 గజాల స్థలం కొనుగోలు చేయాలన్నా సామాన్యుడికి అందుబాటులో ధరలు లేవు. తక్కువలో తక్కువగా గజం రూ.10వేలకు పైగానే పలుకుతుండడంతో సాధారణ పౌరుడు సొంతస్థలం కొనే పరిస్థితి లేకుండాపోయింది. సూర్యాపేట రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ప్రతీ రోజూ కనీసం 100 రిజిస్ట్రేటషన్లు జరగాల్సి ఉండగా ప్రస్తుతం 40 నుంచి 50 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతున్నాయి. గతంలో రోజూ రూ.70 లక్షల ఆదాయం చలాను ద్వారా లభించేంది. ప్రస్తుతం రోజూ రూ.20 నుంచి 30 లక్షల ఆదాయం మాత్రమే వస్తోంది. నెలకు సుమారుగా రూ.21 కోట్ల ఆదాయానికి రూ.9 కోట్లు వస్తోంది.

ప్రజల్లో హైడ్రా భయం నెలకొంది : పంతంగి వీరస్వామిగౌడ్‌, రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌.

హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు జిల్లాపై ప్రభావం చూపుతోంది. ప్రజలు ఏది బఫర్‌జోనో ఏది కాదో తెలియక భూములను కొనుగోలు చేయడంలేదు. రియల్‌ ఎస్టేట్‌ చేసే వారు ఫైనాన్స్‌ తెచ్చి భూములు కొని విక్రయించలేకపోతున్నారు. ఏజెంట్లు ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారు.

రిజిస్ట్రేషన్లు తగ్గిన మాట వాస్తవమే : అంబేడ్కర్‌, ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌, సూర్యాపేట.

సూర్యాపేటలో గతంలో ప్రతిరోజూ 100కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగేవి. ప్రస్తుతం 40 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతున్నాయి. ఎందుకు తగ్గాయో కారణం తెలియదు.

Updated Date - May 15 , 2025 | 12:43 AM