ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నేటికీ అందని రేషన్‌ బియ్యం

ABN, Publish Date - Mar 17 , 2025 | 12:26 AM

పేదలకు ప్రభుత్వం రేషన్‌దుకాణాల ద్వారా బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. ప్రతి నెలా 1నుంచి 25 వ తేదీలోపు రేషన్‌ డీలర్లు బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేయాలి. అయితే ఈ నెల మాత్రం తొలి విడత రేషన్‌ బియ్యం డీలర్లకే పూర్తిస్థాయి అందలేదు.

సరఫరాలో ఆలస్యమే కారణం

ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో స్టాక్‌ లేకపోవడంతో ఆలస్యం

వచ్చే నెల నుంచి సన్నబియ్యం ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం

మిల్లర్ల నుంచి సేకరించి సరఫరా చేస్తున్న వైనం

(ఆంధ్రజ్యోతి,సూర్యాపేట కలెక్టరేట్‌, భువనగిరి కలెక్టరేట్‌) : పేదలకు ప్రభుత్వం రేషన్‌దుకాణాల ద్వారా బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. ప్రతి నెలా 1నుంచి 25 వ తేదీలోపు రేషన్‌ డీలర్లు బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేయాలి. అయితే ఈ నెల మాత్రం తొలి విడత రేషన్‌ బియ్యం డీలర్లకే పూర్తిస్థాయి అందలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఇంకా చాలా మంది లబ్ధిదారులకు రేషన్‌ బియ్యం అందలేదు. బియ్యం కొరతకు అధికారుల నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వస్తున్నాయి. గోదాంలో నిల్వ ఉన్న బియ్యాన్ని సరిహద్దు జిల్లా అయిన ఖమ్మం జిల్లాకు తరలించారని, దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు పంపిణీ చేసే బియ్యంలో కొరత ఏర్పడిందని సమాచారం.

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 610 రేషన్‌దుకాణాలు, 3,05,564 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల్లో సుమారు 8.79లక్షల మంది లబ్ధిదారులు ఉండగా, ప్రతి నెలా సుమారు 4,750 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పంపిణీచేస్తున్నారు. అయితే ఈ నెలలో మాత్రం జిల్లాలో తొలి విడ త డీలర్లు రావాల్సిన బియ్యం సరఫరా కాలేదు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతానికి 3వేల మెట్రిక్‌ టన్నులకు పైగా రేషన్‌ దుకాణాలకు విడతల వారీగా బియ్యం సరఫరా చేశారు. ఇంకా మిగిలిన బియ్యాన్ని సరఫరా చేయాల్సి ఉంది.

నల్లగొండ జిల్లాలో మొత్తం 997 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. వీటికి ఎనిమిది గోదాముల నుంచి బియ్యం సరఫరా చేస్తారు. మిర్యాలగూడ, నల్లగొండ, పెద్దవూర, దేవరకొం డ, నకిరేకల్‌, నిడమనూరు, చండూరు, నాం పల్లి మండలాల్లో ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతీ నెల 6,750 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 4వేలకు పైగా మెట్రిక్‌ టన్నులు మాత్రమే బియ్యాన్ని సరఫరా చేశారు. ఇంకా చాలా దుకాణాలకు బియ్యం చేరలేదు. బియ్యం ఎప్పుడు వస్తాయో డీలర్ల వద్ద స్పష్టమైన సమాచారం లేదు.

ఫ యాదాద్రి జిల్లాలో ఐదు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు ఉన్నాయి. భువనగిరి, ఆలేరు, మోత్కూరు, రామన్నపేట, చౌటుప్పల్‌లో ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు ఉన్నాయి. ప్రతీ నెల చివరి వారంలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు కేటాయించిన కోటాను నెల 1, 2 తేదీల్లోగా రేషన్‌ దుకాణాలకు సరఫరా చేస్తారు. ఆ తరువాత డీలర్లు లబ్ధిదారులకు పంపిణీచేస్తారు. ప్రతీ నెల జిల్లాకు 3,200 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీచేస్తుండగా, ఈ నెల కోటా పూర్తిగా పంపిణీ చేశారు. వీటిని లబ్ధిదారులకు కూడా పంపిణీచేయడం పూర్తయింది.

ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద స్టాక్‌ లేకపోవడంతో

లబ్ధిదారులకు రేషన్‌ దుకాణాల ద్వారా అందించే బియ్యం ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద స్టాక్‌ లేదు. దీంతో రేషన్‌ దుకాణాలకు కోటా ప్రకారం బియ్యం సరఫరా చేయలేకపోయారు. సాధారణంగా ప్రతి నెలా రేషన్‌దుకాణాలకు 5వ తేదీలోగా మొదటి విడత బియ్యాన్ని సరఫరా చేస్తారు. ఈ బియ్యం పంపిణీ పూర్తయ్యాక మరోసారి రెండో విడత బియ్యం సరఫరా చేస్తారు. సంబంధిత డీలరు ప్రతి నెలా 20వ తేదీలోపు లబ్ధిదారులకు బియ్యాన్ని అందించాల్సి ఉంది. ఏదైనా సమస్య తలెత్తి ఆలస్యమైతే అదనంగా మరో నాలుగు రోజులు గడువు ఇస్తారు. కానీ ఈ నెల ఇంకా మొదటి విడత కూడా బియ్యం సర ఫరా కాలేదు. మొదటి విడత సరఫరా అయిన దుకాణాలకు రెండో విడత సరఫరా కాలేదు. దీంతో ఈ నెలలో లబ్ధిదారులకు సక్రమంగా బియ్యం పంపిణీ జరిగేది అనుమానమే.

వేబ్రిడ్జిలు లేకపోవడంతో ఆలస్యం

సూర్యాపేట జిల్లాలో రేషన్‌ దుకాణాలకు బియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం నాలుగు ప్రాంతాల్లో ఎంఎల్‌ఎస్‌ (మండల లెవల్‌ స్టాక్‌) పాయింట్లను ఏర్పాటు చేసింది. సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి, హుజూర్‌నగర్‌ ప్రాంతాల్లో ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు ఉన్నాయి. ఈ పాయింట్ల నుంచి వారి పరిధిలోని రేషన్‌ దుకాణాలకు ప్రతి నెలా బియ్యం సరఫరా చేస్తుంటారు. అయితే ఈసారి బియ్యం సరఫరా మాత్రం ఆలస్యమైంది. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద అధిక సామర్థ్యం ఉన్న వేబ్రిడ్జి లేకపోవడంతో బియ్యం తూకం వేయడం ఆలస్యం అవుతోంది. దీంతో బియ్యం సరఫరా ఆలస్యమైందని, ఇప్పటికైనా ప్రభుత్వం ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద వేబ్రిడ్జిలను ఏర్పాటు చేస్తే వచ్చే నెల నుంచి బియ్యం సరఫరా ఆలస్యం కాకుండా ఉండే అవకాశాలున్నాయి.

వచ్చే నెల నుంచి సన్నబియ్యం

ప్రభుత్వం వచ్చే నెల నుంచి రేషన్‌ దుకాణాల లబ్ధిదారులకు సన్నబియ్యం అందించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే ప్రస్తుతం జిల్లాలో ఈ నెల బియ్యం సరఫరా ఆలస్యమైనట్టు తెలుస్తోంది. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద దొడ్డు బియ్యం స్టాక్‌ లేకుండా పూర్తిగా ఖాళీ చేయిస్తున్నారు. సన్నబియ్యం అందించేందుకు దొడ్డు బియ్యం నిల్వలు ఏమాత్రం ఉండకుండా చర్యలు చేపట్టారు. దీంతో బియ్యం నిల్వలు లేకపోవడంతో ఈనెల పంపిణీ చేసేందుకు పలువురు మిల్లర్ల నుంచి ప్రభుత్వం అవసరమైన బియ్యాన్ని కొనుగోలు చేస్తోంది. కొనుగోలు చేసిన బియ్యాన్ని రేషన్‌దుకాణాలకు సరఫరా చేసి లబ్ధిదారులకు అందించేలా ఏర్పాట్లు చేశారు. దొడ్డు బియ్యం నిల్వలు లేకుండా చేసి వచ్చే నెల నుంచి సన్నబియ్యం అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం సన్నబియ్యాన్ని జిల్లాలో నిల్వ చేసింది. కొన్ని నెలలకు సరిపడా ఈ నిల్వలు ఉన్నట్టు సమాచారం.

దొడ్డు బియ్యం నిల్వలు లేకపోవడంతో ఆలస్యం : ప్రసాద్‌కుమార్‌, సివిల్‌ సప్లయ్‌ డీఎం, సూర్యాపేట

జిల్లాలోని లబ్ధిదారులకు రేషన్‌ దుకాణాల ద్వారా ప్రతీ నెల అందించే దొడ్డు బియ్యం ప్రస్తుతానికి జిల్లాలో నిల్వలు లేవు. దీంతో లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. కొనుగోలు చేసి సరఫరా చేయడం కారణంగా ఆలస్యమవుతోంది. విడతల వారీగా బియ్యం సరఫరా చేస్తున్నాం. త్వరలో జిల్లా మొత్తం బియ్యం సరఫరా అవుతుంది. బియ్యం సరఫరా విషయంలో లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

నేటిలోగా పూర్తిస్థాయిలో బియ్యం పంపిణీ: హరీష్‌, ఇన్‌చార్జి డీఎ్‌సవో, నల్లగొండ

బియ్యం పంపిణీ సోమవారంలోగా పూర్తిచేస్తాం. ఇప్పటి వరకు 80 నుంచి 85శాతం బియ్యం రేషన్‌ దుకాణాలకు సరఫరా అయ్యాయి. రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీని ఈనెల 23 వరకు పూర్తిచేస్తాం. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ బియ్యం పంపిణీ చేస్తాం.

Updated Date - Mar 17 , 2025 | 12:26 AM