రేషన్‌కార్డులు వస్తున్నాయ్!
ABN, Publish Date - Apr 27 , 2025 | 12:06 AM
పేదలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న రేషన్‌కార్డుల మంజూరు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగా ఆహారభద్రతా కార్డుల మంజూరు పత్రాలను జారీచేస్తోంది. ఆ తరువాత కార్డులను ముద్రించి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
జిల్లాలో కొత్తగా 419 కుటుంబాలకు ఆహారభద్రతా కార్డుల మంజూరు పత్రాలు
పేట జిల్లాలో 1050కి పైగా
పదేళ్ల తరువాత మంజూరు
ఈ ప్రభుత్వ హయాంలోనైనా కార్డులు ముద్రించి ఇచ్చేనా?
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): పేదలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న రేషన్‌కార్డుల మంజూరు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగా ఆహారభద్రతా కార్డుల మంజూరు పత్రాలను జారీచేస్తోంది. ఆ తరువాత కార్డులను ముద్రించి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. యాదాద్రి జిల్లాలో 419 కుటుంబాలకు నూతన ఆహారభద్రతా కార్డుల మంజూరు పత్రాలను జారీ చేసింది. సూర్యాపేట జిల్లాలో సుమారు 1050 కిపైగా మంజూరు పత్రాలను జారీ చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో స్థానికత గుర్తింపుతో పాటు పలు ధ్రువీకరణ పత్రాలను రేషన్‌కార్డు ఆధారంగా జారీచేసేవారు. ప్రస్తుతం ఆధార్‌కార్డు మాదిరిగానే ఉమ్మడి రాష్ట్రంలో జారీచేసిన తెల్ల రేషన్‌కార్డులు బహుళ ప్ర యోజనాలకు (మల్టీపర్పస్) ఉపయోగపడేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కార్డులు కేవలం నిత్యావసర సరుకుల పంపిణీకి మాత్రమే పరిమితమైంది. గత ప్రభుత్వం రేషన్‌కార్డులను రద్దు చేసి, వా టి స్థానంలో ఆహారభద్రతా కార్డులను పంపిణీ చేయాలని నిర్ణయించినా, అవి జారీ కాలేదు. కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడగానే అర్హులకు రేషన్‌కార్డులు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఆరు గ్యారెంటీలకు దరఖాస్తులు తీసుకునే సమయంలో ప్రజల నుంచి రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు కూడా తీసుకుంది. ఒక్క యాదాద్రి జిల్లాలో పలు పథకాల కింద 2లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో రేషన్‌కార్డుల కోసం సుమారు 25వేలకు పైగా దరఖాస్తులు ఉన్నాయి. అయితే వీటిని పరిశీలించి, గ్రామాల్లో అధికారులు విచారించిన తర్వాత అర్హులైన వారికి రేషన్‌కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు విచారణ చేపట్టి లబ్ధిదారుల జాబితాను రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో కొత్తగా 419 కుటుంబాల కు ఆహారభద్రతా కార్డులు మంజూరు పత్రాలు జారీ చేసింది. సూర్యాపేట జిల్లాలో 1050కి పైగా మంజూరయ్యాయి. అదేవిధంగా 10వేలకు పైగా దరఖాస్తులు గతంలో ఉన్న రేషన్‌కార్డుల్లో నూతన కుటుంబ సభ్యు ల పేర్ల నమోదుకు వచ్చాయి. వాటిని సైతం అధికారు లు విచారించి పేర్లు నమోదు చేస్తున్నారు. నూతన కార్డుదారులకు మే నెల నుంచి సన్న బియ్యం పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
పదేళ్ల తరువాత...
ప్రభుత్వం ఆహారభద్రతా కార్డుల కింద కుటుంబంలోని మూడేళ్ల వయసు దాటిన వారందరికీ ఆరుకిలలో చొప్పున ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. గత ప్రభుత్వం ఆహారభదత్ర కార్డులుగా పేరు మార్చినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి కార్డులు లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. త్వరలోనే కొత్త కార్డులను పంపిణీ చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించినా, 2,16,904 రేషన్‌కార్డుదారులు ఇప్పటివరకు కాగితాలను జీరాక్స్ చేయించుకుని బియ్యం, ఇతర సరుకులు తీసుకుంటున్నారు. గత సర్కారు కార్డు జారీ ప్రక్రియను వాయిదాలతోనే సరిపెట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రభుత్వంలోనైనా కార్డులు ముద్రిస్తారని లబ్ధిదారులు ఆశిస్తున్నారు. ప్రభుత్వం ప్రతినెలా లబ్ధిదారులకు బియ్యం అందిస్తున్నప్పటికీ, కార్డుల జారీలో జాప్యం జరుగుతోంది. గతంలో డిజిటల్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కార్డుల జారీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ ప్రభుత్వంలోనైనా కొత్తగా ఆహారభద్రతా కార్డులు అందుతాయనే ఆశతో ప్రజలు ఉన్నారు.
జిల్లాలో 2,17,323 కార్డులు
ఉమ్మడి జిల్లాలో 2015 నుంచి ఈ- పాస్ విధానం ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నారు. కొవిడ్-19 సమయం నుంచి ఆహారభద్రతా కార్డుదారులకు ప్రతీ సభ్యుడి కి 6కిలోల చొప్పున ఉచితంగా బియ్యాన్ని పం పిణీ చేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో మొత్తం 2,16,841 ఆహారభద్రతా కార్డులు ఉండగా, వీటి లో 13,734 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. జిల్లా లో మొత్తం 515 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. ప్రతినెలా 4216.320 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. అంత్యోదయ కార్డుదారులకు 13.734 మెట్రిక్ టన్నుల చక్కెర పంపిణీచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రేషన్‌కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. కొత్తగా మంజూరైన కార్డులతో కలిపి రేషన్‌కార్డుల సంఖ్య 2,17,323కు చేరింది. గతంలో రేషన్ దుకాణాల ద్వారా చక్కెర, గోధుమలు, కందిపప్పు, చింతపండు, కారంపొడి, పుసుపు, ఉప్పు, గోధుమపిండి, కిరోసిన్ తదితర నిత్యావసర వస్తువులు పంపిణీచేసింది. ప్రస్తుతం ఇవన్నీ నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వీటి పంపిణీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
మే నుంచి కొత్త లబ్ధిదారులకు సన్నబియ్యం
జి.వీరారెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ యాదాద్రి
ప్రభుత్వం కొత్తగా రేషన్‌కార్డులు జారీచేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా వ్యాపంగా వచ్చిన దరఖాస్తుల్లో 149 కుటుంబాలకు నూతనంగా కార్డు మంజూరీ పత్రాలు జారీచేశాం. మే నేల నుంచి కొత్తగా మంజూరైన ఆహారభద్రతా కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ఈ మేరకు రేషన్‌డీలర్ల వారీగా లబ్ధిదారుల జాబితాను రూపొందించి, స్థానిక తహసీల్దార్‌కు సమాచారం అందించాం. జిల్లాలో సన్న బియ్యం పంపిణీ పకడ్బందీగా చేపడతాం.
Updated Date - Apr 27 , 2025 | 12:06 AM