ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బురద గుంతలతో ఇబ్బందులు

ABN, Publish Date - Apr 29 , 2025 | 12:42 AM

పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో అకాల వర్షాలకు ఏర్పడిన బురద గుంటలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.

చౌటుప్పల్‌ మార్కెట్‌ యార్డులో ఏర్పడిన బురద గుంతలు

చౌటుప్పల్‌ టౌన, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో అకాల వర్షాలకు ఏర్పడిన బురద గుంటలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం రాశుల చుట్టూ ఏర్పడిన ఈ బురద గుంతలు రైతులకు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. మార్కెట్‌ యార్డులో సీసీ కల్లం లేని ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి నెలకొనడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాశుల సమీపంలో బుర ద గుంతలు ఏర్పడడంతో రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కాగా అకాల వర్షాలకు మార్కెట్‌ యార్డులో ఏర్పడిన బురద గుంతలను మట్టితో పూడ్చి వేయించి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని మార్కెట్‌ కమిటీ చైర్మన ఉబ్బు వెంకటయ్య పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆదేశాలతో మార్కెట్‌ యార్డును పునర్మించేందుకు మాస్టర్‌ ప్లాన సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మట్టి ఉన్న ప్రాంతంలో కూడా సీసీ కల్లం నిర్మిస్తామని, ,రైతుల ధాన్యానికి సౌకర్యవంతంగా ఉండే విదంగా మార్కెట్‌ యార్డును తయారు చేస్తామని తెలిపారు.

Updated Date - Apr 29 , 2025 | 12:42 AM