ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వ్యవసాయ యాంత్రీకరణకు ప్రణాళిక సిద్ధం

ABN, Publish Date - Jul 26 , 2025 | 12:20 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రూ పొందించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో గతంలో ఉన్న మార్గదర్శకాలను తొలగించి నూతన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభు త్వం విడుదల చేసింది. శుక్రవారం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 234ను జారీ చేసింది.

నూతన మార్గదర్శకాలు విడుదలచేసిన ప్రభుత్వం

2025-26 ఆర్థిక సంవత్సరానికి పథకాన్ని వర్తింపజేస్తూ ఉత్తర్వులు

ఉమ్మడి జిల్లాకు రూ.6.18కోట్లు మంజూరు

వచ్చే నెల 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ

సెప్టెంబరు 7 నుంచి 17 వరకు పరికరాల పంపిణీ

(ఆంధ్రజ్యోతి,నల్లగొండ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రూ పొందించిన వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో గతంలో ఉన్న మార్గదర్శకాలను తొలగించి నూతన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభు త్వం విడుదల చేసింది. శుక్రవారం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 234ను జారీ చేసింది. దీంతో వ్యవసాయశాఖ అధికారులు నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవసాయ యాంత్రీకరణకు సన్నాహాలు ప్రారంభించారు.

గతంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్య వసాయ యాంత్రీకరణ పథకం అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, 2025-26 ఆర్థిక సంవత్సరానికీ ఈ పథకాన్ని కొనసాగి స్తూ నిర్ణయం తీసకుంది. ఈ పథకం అమలు కోసం రూ.6.18కోట్ల ను కేటాయించింది. అందులో నల్లగొండ జిల్లాకు రూ.3.14కోట్లు, సూర్యాపేట జిల్లాకు రూ.1.84కోట్లు, యాదాద్రి జిల్లాకు రూ.1.24 కోట్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం 60శాతం నిధులను, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులను ఈ పథకానికి కేటాయిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మహిళా రైతులకు 50శాతం సబ్సిడీ ఇవ్వనుండగా, జనరల్‌ కేటగిరీ రైతులకు 40శాతం సబ్సిడీ వర్తించనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పథ కం అమలు ఆలస్యం కావడంతో బడ్జెట్‌ కేటాయింపులు చేయలేకపోయారు. దీంతో 2025- 26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని వానాకా లం నుంచి యాసంగి వరకు పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు.

వచ్చే నెల 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ...

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వ్యవసా య యాంత్రీకరణ పథకానికి సంబంధించి వచ్చే నెల 5 నుంచి 15వ తేదీ వరకు రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు తీసుకుంటా రు. గతంలో దరఖాస్తు చేసిన రైతులను సైతం పరిగణనలోకి తీసుకుంటారు. వ్యవసాయాధికారులు అన్ని దరఖాస్తులను కలెక్టర్లకు నివేదిస్తారు. కలెక్టర్లు ఆగస్టు 16 నుంచి 20వ తేదీ వరకు వాటిని పరిశీలిస్తారు. ఒకవేళ దరఖాస్తు ను తిరస్కరిస్తే అందుకు సంబంధించిన కారణాన్ని రైతులకు తెలియజేస్తారు. ఆగస్టు 21 నుంచి 27వ తేదీ వరకు ఎంపికైన రైతుల నుంచి డీడీలు తీసుకుంటారు. 27 నుంచి సెప్టెంబరు 5వ తేదీ వరకు మంజూరు ఉత్తర్వులు ఇస్తారు. సెప్టెంబరు 7 నుంచి 17వ తేదీలోగా రైతులకు పరికరాలు పంపిణీ చేస్తారు. నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుకు వ్యవసాయ అధికారులు కార్యాచరణను రూపొందిస్తున్నారు. కూలీల కొరత ఉన్న నేపథ్యంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడమే మంచిదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకు కేంద్ర భాగస్వామ్యంతో సబ్సిడీపై రైతులకు పరికరాలు అందించేందుకు నిర్ణయించింది. మందుల పిచికారీకి డ్రోన్‌ల వినియోగంపై కూడా రైతులకు అవగాహన కల్పించనున్నారు. గత ఆరేళ్లుగా వ్యవసాయ యాంత్రీకరణ పథకం అటకెక్కగా, తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులకు ప్రయోజనం చేకూరనుంది. రైతులకు నచ్చిన కంపెనీకి చెందిన వ్యవసాయ పరికరాలనే అందించనున్నారు.

15 రకాల యాంత్రీకరణ పరికరాల గుర్తింపు..

ఆధునిక వ్యవసాయాన్ని ప్రొత్సహించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత కొనసాగిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం గత ఆరేళ్లుగా నిలిచింది. దీంతో రైతులు ఆధునిక వ్యవసాయంపై దృష్టిసారించే అవకాశం లేకుండాపోయింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం నాలుగేళ్ల పాటు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కొనసాగగా, ఆ తరువాత ఆరేళ్లపాటు నిలిచింది. ఈ పథకాన్ని అమలు చేయాలని రైతులు, రైతు సంఘాలు డిమాండ్‌ చేసినా గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ యాంత్రీకరణ ఊసు లేకుండాపోయింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక గత ఏడాది యాసంగి నుంచే రైతులకు రాయితీపై వ్యవసాయ పరికరాలను అందజేయాలని నిర్ణయించింది. జిల్లాల వారీగా రైతుల నుంచి ఉన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు ఉమ్మడి జిల్లాల వ్యవసాయ అధికారుల నుంచి నివేదికలు తీసుకుంది. రైతులకు అందజేయాల్సిన పనిముట్లు, 15 రకాల యంత్ర పరికరాల జాబితాను రూపొందించారు. అందులో రోటర్‌వేటర్‌లు, నాగళ్లు, కల్టివేటర్లు, స్ర్పేయర్లు, పవర్‌ వీడర్లు, డ్రోన్లు ఉన్నాయి.

నూతన మార్గదర్శకాలతో పథకం అమలు : పి.శ్రవణ్‌కుమార్‌, జేడీఏ, నల్లగొండ

రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు వెల్లడించింది. కొత్త మార్గదర్శకాల ప్రకా రం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలుచేస్తాం. ప్రభుత్వం విధివిధానాల ను వెల్లడించింది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం రైతులకు ఎంతగానో ఉపయోగంకానుంది. ఆధునిక పరికరాలతో వ్యవసాయం చేయడం వల్ల సమయం ఆదా కావడంతో పాటు అధిక దిగబడులకు అవకాశం ఉంటుంది. ఆగస్టు 5వ తేదీ నుంచి దరఖాస్తులు తీసుకొని లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి సెప్టెంబరు 17లోగా యాంత్రీకరణ పరికరాలు అందజేస్తాం. అర్హులైన ప్రతీ రైతుకు ఈ పథకాన్ని వర్తింపజేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ రైతులకు 50శాతం సబ్సిడీ, ఇతర రైతులకు 40శాతం సబ్సిడీ అందజేస్తాం.

Updated Date - Jul 26 , 2025 | 12:20 AM