వానాకాలం సాగుకు సన్నద్ధం
ABN, Publish Date - May 18 , 2025 | 12:11 AM
ఈసారి కొంత ముందస్తుగానే నైరుతి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ ఇటీవల పేర్కొంది. అన్నట్టుగానే వాతావరణం చల్లబడడం, అక్కడక్కడ వానలు కురుస్తుండడంతో రైతులు సాగుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదునులోగా విత్తనాలు వేసేందుకు దుక్కులు దున్నుకుంటున్నారు.
అదునులోగా విత్తనాలు వేసేందుకు దుక్కులు దున్నుతున్న రైతులు
4.50లక్షల ఎకరాల పంటల సాగు
వరి, పత్తి, పొద్దుతిరుగుడుపై మొగ్గు
ఆంధ్రజ్యోతి-యాదాద్రి): ఈసారి కొంత ముందస్తుగానే నైరుతి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ ఇటీవల పేర్కొంది. అన్నట్టుగానే వాతావరణం చల్లబడడం, అక్కడక్కడ వానలు కురుస్తుండడంతో రైతులు సాగుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదునులోగా విత్తనాలు వేసేందుకు దుక్కులు దున్నుకుంటున్నారు. గతంలో మాదిరే ఈ సారి కూడా పత్తి, వరి, పొద్దుతిరుగుడు సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నా రు. అయితే వానాకాలం పంటల సాగుకు వ్య వసాయ శాఖ ఇప్పటికే కార్యాచరణ ప్రణాళి క సిద్ధం చేసింది. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.
తొలకరి పలకరించగానే పంటలను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వానాకా లం పంటలను ముందస్తుగానే సాగు చేసేందు కు రైతులు సన్నద్ధమవుతున్నారు. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి రైతులు ముందస్తుగా ఏ పంటలను వేయాలన్న దానిపై ఒక నిర్ణయానికి వచ్చారు. రైతులంతా దుక్కులు దున్ని, పంటలు వేసేందుకు పొలాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సీజన్‌లో జిల్లాలో వానాకాలం పంటల సాగు 4.50లక్షల ఎకరాల సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. రైతులకు విత్తనాలు, ఎరువు లు అందుబాటులో ఉంచింది. గత సీజన్‌లో పత్తికి రెట్టింపు స్థాయిలో ధరలు పలికాయి. అయితే ఈసారి రైతులు వరితోపాటు వాణిజ్య పంటలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. పత్తి, పొద్దుతిరుగుడుపువ్వు, తదితర ఆరుతడి పంటలను సాగుచేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మే మొదటివారంలో జిల్లావ్యాప్తంగా అకాలవర్షం కురిసింది. ఈ వర్షాలకు నల్లరేగడి భూముల్లో అప్పటికే దుక్కులు దున్నకున్న రైతులు ముందస్తుగానే పత్తి విత్తనాలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రైతులు తమ పొలాల్లో దుక్కులు దున్నుకుని, పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అదనులో సాగు చేస్తే సకాలంలో చేతికి రావడంతోపాటు సమృద్ధిగా దిగుబడి వస్తుందని రైతుల నమ్మకం. ఈసారి రుతుపవనాలు జూన్ మొదటివారంలోనే ప్రవేశించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవగానే మెట్ట పంటలను సాగు చేసేందుకు నడుం బిగించారు. వర్షాధారితంగా మెట్ట పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సమకూర్చుకుంటున్నారు. జిల్లాలో వర్షాధారంగా ప్రధానంగా సాగుచేసే పత్తి విత్తనాల కొనుగోలు పెద్దఎత్తున ప్రారంభమయ్యాయి. వానాకాలం పంటల సాగుకు వ్యవసాయాధికారులు ఇప్పటికే కార్యాచరణ ప్రణాళికలు సిద్ధంచేశారు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నకిలీ విత్తనాలపై నిఘా వేస్తూ తనిఖీలు ముమ్మరం చేశారు.
జిల్లాలో వానాకాలం పంటల సాగు 4.50లక్షల ఎకరాలు
జిల్లాలో వానాకాలం పంటల సాగు లక్ష్యం 4.50లక్షల ఎకరాలుగా వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. వరి, పత్తి పంటలనే అధికంగా సాగుచేసే అవకాశం ఉంది. సాధారణంగా 2.60లక్షల వరకు వరిని సాగుచేస్తారు. అయితే ఈసారి పత్తి పంటను 2.95లక్షల ఎకరాల వరకు సాగుచేసే అవకాశం ఉందని అంచనా వేయగా..., 73,750 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉంచారు. జిల్లావ్యాప్తంగా 13,575 ఎకరాల్లో కూరగాయల తోటలు సాగు జరుగుతోంది. ఈసారి కూరగాయల సాగును 20వేల ఎకరాలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పత్తి 1,15,000 ఎకరాల సాగు చేసేందుకు అంచనా వేయగా, ఇందుకోసం 2,30600 పత్తి విత్తనాల ప్యాకేట్లు సిద్ధంగా ఉంచారు. కందులు 6,800 ఎకరాలకు 240 క్వింటాళ్లు విత్తనాలు, జొన్న 600 ఎకరాలకు 124 క్వింటాళ్లు విత్తనాలు సిద్ధంచేశారు. ఇతర పంటలు 23,200 ఎకరాల వరకు అంచనా వేశారు. వీటిలో పెసర 600 ఎకరాల 48 క్వింటాళ్ల విత్తనాలు, ఉలువలు 100 ఎకరాలకు 15 క్వింటాళ్లు, మొక్కజొన్న 100 ఎకరాలకు ఎనిమిది క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంచేశారు. తొలకరి పలకరించగానే పత్తి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసరు వంటి మెట్ట పంటలకు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో బోర్లు, మూసీ పరివాహక ప్రాంతంలోనే వరి సాగవుతోంది. మిగతా వర్షాధారిత పంటల్లో పత్తి, కంది పంటలు మాత్రమే ప్రధానంగా సాగుచేస్తారు. అయితే గత సీజన్‌లో అధిక వర్షాల కారణంగా పత్తి పంట తీవ్రంగా దెబ్బతిని రైతులు నష్టపోయారు. అయితే ఈఏడాది అదనులో వర్షాలు కురిస్తే, చీడ పీడలు, ప్రకృతి వైపరీత్యాలు లేకుంటే లాభాలు వస్తాయనే ఆశలతో దుక్కులు దున్ని పంటలు సాగుకు సిద్ధం చేశారు.
నకిలీ విత్తనాలు అరికట్టేందుకు చర్యలు
జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టడానికి జిల్లా అధికార యంత్రాంగం పటిష్ఠమైన చర్య లు తీసుకుంటోంది. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, ఇద్దరు వ్యవసాయ అధికారులు, మరో ఇద్దరు పోలీస్ అధికారులతో టాస్క్‌ఫోర్స్ టీం ఏర్పాటుచేశారు. ప్రతీ దుకాణంలో ఎరువులు, విత్తనాలు, వాటి నాణ్యతా ప్రమాణాలను పరిశీలిస్తున్నారు. నకిలీ విత్తనాలను, గడువు మీరిన, నాణ్యత ప్రమాణాల మేరకు లేని విత్తనాలను విక్రయించిన పక్షంలో కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
వానాకాలం సాగుకు అంచనాలు రూపొందించాం : గోపాల్, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి
వానాకాలంలో జిల్లా లో 4.50లక్షల ఎకరా ల్లో వివిధ రకాల పం టలు సాగవుతాయని అంచనాలు రూపొందిం చాం. ఈ మేరకు రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉం చాం. పంటల సాగుకోసం రైతు ముంగిట శాస్త్రవేత్త పేరుతో జిల్లాలోని రైతుల వద్దకు శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు వెళ్లి సూచనలు చేస్తున్నారు. శాస్ర్తీ య పద్ధతిలో సాగు చేపట్టాలని రైతులకు సూచిస్తున్నాం. పంటలు సాగుపై రైతులకు పూర్తిగా అవగాహన కల్పిస్తున్నాం.
Updated Date - May 18 , 2025 | 12:11 AM