‘ప్రజావాణి’ అర్జీలను పరిష్కరించాలి
ABN, Publish Date - May 13 , 2025 | 12:21 AM
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిష్కరించాలని, ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని కలెక ్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వివిద ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, మాట్లాడారు.
భువనగిరి (కలెక్టరేట్),మే12 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిష్కరించాలని, ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని కలెక ్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వివిద ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, మాట్లాడారు. మొత్తం56 అర్జీలు వచ్చాయన్నారు. అనంతరం జిల్లా అధికారులనుద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం పథకాలకు లబ్ధిదారుల ఎంపికపై అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణ ప్రగతి బేస్మెంట్ వరకు పూర్తయితే రూ.లక్ష, గోడలు పూర్తయ్యాక మరో రూ.లక్ష ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీ. వీరారెడ్డి, జడ్పీ సీఈవో శోభారాణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, కలెక్టరేట్ ఏవో జగన్‌మోహన్‌ప్రసాద్, పలుశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అయ్యా మమ్మల్ని చూడట్లేదు...
ఉన్న ఒక్క కుమారుడు సరిగ్గా చూడకపోతాడా అని నమ్మి ఎకరం భూమికి పైగా రిజిస్ట్రేషన్ చేశానని, బుక్కెడు బువ్వ పెట్టడం లేదని తన భూమి తనకు ఇవ్వాలని రాజాపేట మండలం కుర్రారం గ్రామానికి చెందిన బొంగోని అండమ్మ కలెక్టర్‌ను కోరింది. తన పోషణ ఎవరు చూస్తారని అడిగితే కొట్టి తరిమేయడంతో పోలీసులను ఆశ్రయించానని, అక్కడా కనికరించలేదని బోరున విలపించింది.
ఫ తాను దివ్యాంగురాలినని, ఇల్లు, నాలుగు ఎకరాలకు పైగా భూమి తీసుకొని తన కుమారులు తనను చూడటం లేదని, తన భూమి తనకు ఇప్పించాలని గుండాల మండలం అంబాలకు చెందిన కందాల శాంతమ్మ ఫిర్యాదు చేశారు.
ఫ తన భర్త స్వార్జితమైన 50 ఎకరాల భూమిని ఇద్దరు కుమారులకు సమంగా ఇచ్చానని, తన పోషణ చూడటం లేదని యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటకు చెందిన 87 సంవత్సరాల వృద్ధురాలు బత్తి శశిరేఖ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఉన్న ఇల్లు, ఖాళీ స్థలాలు విక్రయించడానికి యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకొని తన సంరక్షణ మరిచినందుకు తన భర్త ద్వారా సంక్రమించిన ఆస్తులను రద్దు చేసి న్యాయం చేయాలని
Updated Date - May 13 , 2025 | 12:21 AM