‘ప్రజావాణి’ దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి
ABN, Publish Date - Jul 29 , 2025 | 12:42 AM
‘ప్రజావాణి’లో వచ్చిన అన్ని దరఖాస్తులను పెండింగ్ లేకుండా చూసి సత్వర పరిష్కారానికి చొరవ చూపాల ని అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావుు అన్నా రు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో వివిధ ప్రాంతాల ప్రజల వినతులు, ఫిర్యాదులకు సంబంధించిన 81 దరఖాస్తులను వారు స్వీకరించారు.
అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు
భువనగిరి (కలెక్టరేట్), జూలై 28 (ఆంధ్రజ్యోతి): ‘ప్రజావాణి’లో వచ్చిన అన్ని దరఖాస్తులను పెండింగ్ లేకుండా చూసి సత్వర పరిష్కారానికి చొరవ చూపాల ని అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావుు అన్నా రు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో వివిధ ప్రాంతాల ప్రజల వినతులు, ఫిర్యాదులకు సంబంధించిన 81 దరఖాస్తులను వారు స్వీకరించారు. ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యం ఇచ్చి అన్నింటినీ వేగంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు చెందిన 59 దరఖాస్తులు రాగా, జిల్లా పంచాయితీకి 9, జిల్లా సంక్షేమ శాఖ 3, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ 2, విద్యాశాఖ 2, సర్వే అండ్ ల్యాండ్, అటవీ శాఖ, విద్యుత్ శాఖలకు ఒక్కో దరఖాస్తు చొప్పున వచ్చాయని తెలిపారు. ప్రజలు గ్రీవెన్స్‌డేలో చేసుకున్న దరఖాస్తులతో పాటుగా రాష్ట్ర ‘ప్రజావాణి’లో వచ్చిన వాటిని కూడా పరిశీలించి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈ వో ఎన్.శోభారాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టీ. నాగిరెడ్డి, కలెక్టరేట్ ఏవో జగన్‌మోహన ప్రసాద్, హౌసంగ్ పీడీ విజయ్ సింగ్ పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వినతులు, ఫిర్యాదులు ఇలా..
తన బాగోగులు చూడకుండా రక్షణ, పోషణ చేయకుండా తన ఇంటిని అక్రమంగా పేరు మార్పిడి చేసుకొని ఇంటి నుంచి బయటికి వెళ్లగొట్టిన తన కుమారుడిపై చర్యలు తీసుకొని ఇంటిని తన పేరున మార్చాలని సంస్ధాన్ నారాయణపురం మండ లం సర్వేల్ గ్రామానికి చెందిన వృద్ధురాలు గుబ్బ భారతమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది.
ముదిరాజ్ మత్య్స కార్మికులకు మత్స్య కార్మిక సంఘంలో సభ్యత్వం ఇప్పించి నూతన సంఘం ఏర్పా టు చేయాలని కోరుతూ రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన సుమారు 100 మంది మత్య్స కార్మికులు కోరారు.
సర్వే నంబర్ 180 ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతూ రాళ్లను తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని బొమ్మలరామారం మండలం జలాల్‌పురం గ్రామానికి చెందిన పలువురు కోరారు.
దివ్యాంగుల ఉపకరణం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా తనకు వాహనం కేటాయించ లేదని, పూర్తిగా నడవలేని దివ్యాంగుడినైన తనకు బ్యాటరీ క్రష్‌లతో కూడిన రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వాహనాలు ఇ ప్పించాలని మూటకొండూరు మండలం దిలావర్‌పూర్ గ్రామానికి చెందిన రచ్చ ఉపేందర్, భువనగిరి 25 వ వార్డుకు చెందిన కొండపర్తి క్రిష్ణమాచారి కోరారు.
ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని భువనగిరి మండలం ముస్త్యాలపల్లికి చెందిన బోదాసు మణెమ్మ, పల్లపు ఎల్లమ్మ, తులసి, అంకిత కోరారు.
అసమానతలు, వివక్ష లేని సమాజానికి ఎంతో అవసరమైన పౌర హక్కుల దినోత్సవాన్ని ప్రతి మండలంలో ప్రతీ నెల జరిగేలా చూడాలని ఎమ్మార్పీస్ నాయకులు కోరారు.
మోత్కూరు: భారత్ గ్యాస్ ఏజన్సీ నిర్వాహకులు సిలిండర్లు డోర్‌డెలివరీ చేయకుండా బిల్లుపై అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వినియోగదారుల సం ఘాల రాష్ట్ర కార్యదర్శి పోచం సోమయ్య ఫిర్యాదు చేశారు.
Updated Date - Jul 29 , 2025 | 12:42 AM