ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘ప్రజావాణి’ దరఖాస్తులను పరిష్కరించాలి

ABN, Publish Date - Jul 15 , 2025 | 12:43 AM

‘ప్రజావాణి’కి వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావు సం బంధిత అధికారులను ఆదేశించారు.

అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావు

భువనగిరి (కలెక్టరేట్‌), జూలై 14 (ఆంధ్రజ్యోతి): ‘ప్రజావాణి’కి వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావు సం బంధిత అధికారులను ఆదేశించారు. సోమవా రం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ప్రజల నుంచి 70 దరఖాస్తులు తీసుకోగా, అందులో అత్యధికంగా రెవెన్యూశాఖకు చెందినవి 57 ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎన్‌.శోభారాణి, డీపీవో సునంద, డీఆర్డీవో టీ.నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఫ ఆలేరు మండలం కొలనుపాక రెవెన్యూలోని తమ భూమిని హైకోర్టు ఆదేశాల ప్రకారం రికార్డుల్లో నమోదు చేయాలని ఆలేరుకు చెందిన రావుల మహేందర్‌రెడ్డి, రావుల రవీందర్‌రెడ్డి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఫ వేధిస్తున్న తనకుమారుడి నుంచి రక్షిం చి,వయోవృద్ధుల సంరక్షణ చట్టం ప్రకారం త నఆస్తిని తిరిగి ఇప్పించాలని భువనగిరి మం డలం చందుపట్ల గ్రామానికి చెందిన ఇంద్రవెళ్లి దానయ్య కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు.

ఫ ఆలేరు మండలం షారాజీపేటలో సర్వే నంబర్‌ 459లోని 24గుంటల భూమికి పౌతి చేయవద్దని దూడల రమేష్‌ వినతిపత్రం అందజేశాడు.

ఫ అవగాహన లేకుండా సరై న చికిత్స చేయకపోవడంతో తన కోడలి గర్భవిచ్ఛితికి కారణమైనభువనగిరిలోని కేకే నర్సిం గ్‌ హోం వైద్యులపై చట్టపర చర్యలు తీసుకోవాలని భువనగిరి మండలం రాయిగిరికి చెం దిన బొజ్జ నర్సింహ ఫిర్యాదు చేశాడు.

ఇళ్ల నిర్మాణాలకు సహకరించాలి

ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక, కంకర, ఇ టుక, ఐరన్‌, తదితర సామగ్రిని తక్కువ ధర కు ఇవ్వాలని అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భా స్కర్‌రావు కోరారు. సోమవారం పలు మండలాలకు చెందిన ఇటుక బట్టీల యజమానులు, మేస్త్రీలు, సిమెంట్‌ డీలర్లు, స్టోన్‌ క్రషర్స్‌ యజమానులతో కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. అధికారులు తీర్మా నం చేసిన ధరకు ఇంటి నిర్మాణ సామగ్రిని విక్రయించాలని కోరారు. బేస్‌మెంట్‌ నిర్మాణం పూర్తయిన ఇళ్లకు ప్రతీ సోమవారం లక్ష రూ పాయలు లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో జమవుతాయన్నారు. సమావేశంలో ఆర్డీవో కృష్ణారెడ్డి, హౌసింగ్‌ పీడీ విజయ్‌సింగ్‌, మైనింగ్‌ ఏడీ రాఘవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 12:43 AM