ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘ప్రజావాణి’ దరఖాస్తులను పరిష్కరించాలి

ABN, Publish Date - May 06 , 2025 | 12:18 AM

‘ప్రజావాణి’ దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా పరిష్కరించాలని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో దరఖాస్తులు తీసుకున్నారు. మొత్తం48 దరఖాస్తులు రాగా, వాటిలో అత్యధికంగా రెవెన్యూ శా ఖకు చెందినవి 29 ఉన్నాయి.

కలెక్టర్‌ ఎం.హనుమంతరావు

భువనగిరి (కలెక్టరేట్‌), మే 5 (ఆంధ్రజ్యోతి): ‘ప్రజావాణి’ దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా పరిష్కరించాలని కలెక్టర్‌ ఎం.హనుమంతరావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో దరఖాస్తులు తీసుకున్నారు. మొత్తం48 దరఖాస్తులు రాగా, వాటిలో అత్యధికంగా రెవెన్యూ శా ఖకు చెందినవి 29 ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ‘ప్రజావాణి’ దరఖాస్తులను అధికారులు పరిశీలించి పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌ యువ వికా సం పథకాలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పునాదుల నిర్మాణం పూర్తయిన ఇళ్లకు రూ.లక్ష, గోడల నిర్మా ణం పూర్తయ్యే క్రమంలో మరో రూ.లక్ష ప్రభుత్వం జ మ చేస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎన్‌.శోభారాణి, ఎస్డీసీ జయశ్రీ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టి.నాగిరెడ్డి, కలెక్టరేట్‌ ఏవో జగన్‌మోహన ప్రసా ద్‌, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సాధనలో ఉద్యమకారులపాత్రను గుర్తించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చే యాలని, 250గజాల ఇంటి స్థలంతో పాటు రూ.30వేల పెన్షన్‌ ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది.

ఆలేరు-నల్లగొండ బస్సును పునరుద్ధరించాలని, మో టకొండూరు మండల కేంద్రానికి బస్సు సౌకర్యం కల్పించాలని, కాటేపల్లిలోని బాంబుల కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రైవేట్‌ స్కూలు బస్సులు కిరాయిలకు వెళ్లి తమ ఉపాధిని దెబ్బ తీస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ట్యాక్స్‌ పెయిడ్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ నాయకులు ఫిర్యాదు చేశారు.

రెడ్డినాయక్‌తండా పంచాయతీలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందని, మాజీ సర్పంచ్‌ చేయని పనులకు అధికారులతో తప్పుడు ఎంబీలను రికార్డు చేయించి డబ్బు కాజేశారని, దీనిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన భూక్య రఘు ఫిర్యాదు చేశారు.

భూభారతి ద్వారా భూసమస్యల పరిష్కారం

(ఆంధ్రజ్యోతి, ఆత్మకూరు(ఎం)): భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలు పరిష్కరించనున్నట్టు కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు.మండలంలో పైలెట్‌ గ్రామంగా ఎంపికైన రాయిపల్లి, సర్వేపల్లి గ్రామాల్లో సోమవారం నిర్వహించిన భూభారతి సదస్సులో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులు భూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. రైతులు చేసిన ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామన్నారు. అధికారులే నేరుగా గ్రా మాలకు వెళ్లి రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న ట్టు తెలిపారు. వక్ఫ్‌ భూములకు సంబంధించి ఎవరికీ పట్టాలు రావన్నారు. ప్రభుత్వ భూములుంటే గుర్తిస్తామన్నారు. అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామంలోనే ఉంటారని, రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో వివిధ భూసమస్యలకు సంబంధించి రాయిపల్లిలో 11, సర్వేపల్లిలో 5 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణారెడ్డి, మండల ప్రత్యేక అధికారి రాజారామ్‌, ఆత్మకూరు, వలిగొండ తహసీల్దార్లు వి.లావణ్య, శ్రీనివా్‌సరెడ్డి, డీటీ షఫీఉద్దీన్‌, ఆరై మల్లికార్జునరావు, పాండయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2025 | 12:18 AM