ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వెలవెలబోతున్న చెరువులు

ABN, Publish Date - Jul 26 , 2025 | 12:10 AM

చౌటుప్పల్‌ టౌన్‌, జూలై 25(ఆంధ్రజ్యోతి):మండలంలోని చెరువులు వర్షాకాలంలో నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. జిల్లాకు సమీపంలో ఉన్న హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర మంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

మూడు, నాలుగేళ్లుగా ఇదే దుస్థితి

నిరాశలో రైతులు

చౌటుప్పల్‌ టౌన్‌, జూలై 25(ఆంధ్రజ్యోతి):మండలంలోని చెరువులు వర్షాకాలంలో నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. జిల్లాకు సమీపంలో ఉన్న హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర మంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కానీ ఈ ప్రాంతంలో నామమాత్రపు వర్షాలతో రైతుల్లో తీవ్ర నిరాశే అలముకుంది. కనీసం వ్యవసాయ భూముల్లో వరదలు కూడ పారలేదు. మండలంలో ప్రా ధాన్యతను సంతరించుకున్న లక్కారం, తంగడపల్లి, చౌటుప్పల్‌, డి.నాగా రం, మల్కాపురం, కైరతాపురం తదితర చెరువులలోకి వరదనీరు చుక్క కూడ చేరని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ‘లక్కారం చెరువు నిండితే నల్లగొండ పొయ్యిలలో నీరు ఊరుతుంది’ అన్న సామెత కూడా ఉంది. ఈ చెరువు ప్రాధాన్యత ఎంతఉందో అర్థం చేసుకోవచ్చు. మండలంలోని అనేక గ్రామాల్లో సాగు నీరు లేక వరి పొలాలు బీడు బారిపోతున్నాయి. మూడు, నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి రిపీట్‌ అవుతుంది. రైతులు వరిసాగును వదిలిపెట్టి ఇతర పనులపై దృష్టి సారిస్తుండగా, మరికొన్ని గ్రామాల్లో ఆకు కూరలతో జీవనోపాధి పొందుతున్నారు. కాగా, గత వారం, పదిరోజులుగా ఆడపాదడపా కురుస్తున్న వర్షాలతో పత్తిచేలుకు ప్రా ణం పోసినట్లయ్యింది. తప్ప భూగర్భ జలాలు అంగుళం కూడ పెరగలేదు. ఇదే పరిస్థితి మరోక యేడు కొనసాగిన పక్షంలో రైతులకు వలసలు తప్పవు మరి...

Updated Date - Jul 26 , 2025 | 12:10 AM