ఆగస్టు 15 నాటికి మొక్కలు నాటాలి
ABN, Publish Date - Jul 25 , 2025 | 01:09 AM
వనమహోత్సవంలో భాగంగా ఆగస్టు 15 నాటికి ప్రభుత్వ శాఖలకు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ అన్నారు.
ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్
నల్లగొండ (కలెక్టరేట్), జూలై 24 (ఆంధ్రజ్యోతి): వనమహోత్సవంలో భాగంగా ఆగస్టు 15 నాటికి ప్రభుత్వ శాఖలకు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వనమహోత్సవంలో భాగంగా గుంతలు తవ్వి మొక్కలు నాటడాన్ని ఆగస్టు 15 లోపు పూర్తిచేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరం చేయాలన్నారు. రా నున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ల సహకారంతో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్, డీఆర్డీవో శేఖర్‌రెడ్డి, డీపీవో వెంకయ్య, జడ్పీ డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు, పాల్గొన్నారు.
Updated Date - Jul 25 , 2025 | 01:09 AM